ఏల మమ్ము గాసిసేసే రింకా మీరు
(॥పల్లవి॥)
ఏల మమ్ము గాసిసేసే రింకా మీరు
కాలముతో నిలిచేను కైవల్యపదవి
(॥ఏల॥)
పాపములు హరినామపఠనచేఁ బాపుకొంటి
కైపుగఁ జిత్రగుప్తుఁ డాకవిలె గట్టు
కోపులఁ బుణ్యములెల్ల గోవిందుని కిచ్చితిమి
పూఁపల స్వర్గము త్రోవ భుజవేయరో
(॥ఏల॥)
అతుమలో నజ్ఞాన మాచార్యుఁడే పాపె
ఆతల జన్మాల వాకిలటు ముయ్యరో
చేత హరిదాస్యమున జీవన్ముక్తుఁడనైతి
జాతి యధర్మములాల సంబంధము విడరో
(॥ఏల॥)
పరమాత్ము చింతచేత బదుకు నిశ్చయమాయ
ధరఁ గైవసము గావో తగుచిత్తమా
యిరవైన శ్రీవేంకటేశుఁ డేలుకొనె మమ్ము
పరదేవతలు మాకుఁ బనిలేదు మీరు
(||pallavi||)
ela mammu gāsisese riṁkā mīru
kālamudo nilisenu kaivalyabadavi
(||ela||)
pābamulu harināmabaṭhanasem̐ bābugŏṁṭi
kaibugam̐ jitraguptum̐ ḍāgavilĕ gaṭṭu
kobulam̐ buṇyamulĕlla goviṁduni kichchidimi
pūm̐pala svargamu trova bhujaveyaro
(||ela||)
adumalo najñāna māsāryum̐ḍe pābĕ
ādala janmāla vāgilaḍu muyyaro
seda haridāsyamuna jīvanmuktum̐ḍanaidi
jādi yadharmamulāla saṁbaṁdhamu viḍaro
(||ela||)
paramātmu siṁtaseda badugu niśhchayamāya
dharam̐ gaivasamu gāvo tagusittamā
yiravaina śhrīveṁkaḍeśhum̐ ḍelugŏnĕ mammu
paradevadalu māgum̐ baniledu mīru