ఏల మమ్ము భ్రమయించే రింతులాల
(॥పల్లవి॥)
ఏల మమ్ము భ్రమయించే రింతులాల
తేలించేరు మాటలనే తెరవలాల
(॥ఏల మమ్ము॥)
సిగ్గులు యెగ్గులు వాసె చీఁదక చీమిడి వాసె
దగ్గరి మీ రుండితేఁ దరుణులాల
వొగ్గితి మెంగిలితమ్మ కొకయింత దయ లేదు
వెగ్గళించే రప్పటిని వెలఁదులాల
(॥ఏల మమ్ము॥)
పాపము లన్నియుఁ దెగె బంధము లన్నియునూడె
కొపగించుకొంటే మీరు కొమ్మలాల
తీపుల మా దేహము తెగ నమ్మితిమి మీకు
యేఁపుల నేల పెట్టేరు యిట్టె సతులాల
(॥ఏల మమ్ము॥)
దావతిపాట్లు మానె తరవు లుడిగెను మా
తోవ రాకుండితేఁ జాలు తొయ్యలులాల
శ్రీవెంకటేశ్వరుఁడు చేరి మమ్ము దయ నేలె
చేవ దేరె మీకు మాకుఁ జెలులాల
(||pallavi||)
ela mammu bhramayiṁche riṁtulāla
teliṁcheru māḍalane tĕravalāla
(||ela mammu||)
siggulu yĕggulu vāsĕ sīm̐daga sīmiḍi vāsĕ
daggari mī ruṁḍidem̐ daruṇulāla
vŏggidi mĕṁgilidamma kŏgayiṁta daya ledu
vĕggaḽiṁche rappaḍini vĕlam̐dulāla
(||ela mammu||)
pābamu lanniyum̐ dĕgĕ baṁdhamu lanniyunūḍĕ
kŏbagiṁchugŏṁṭe mīru kŏmmalāla
tībula mā dehamu tĕga nammidimi mīgu
yem̐pula nela pĕṭṭeru yiṭṭĕ sadulāla
(||ela mammu||)
dāvadibāṭlu mānĕ taravu luḍigĕnu mā
tova rāguṁḍidem̐ jālu tŏyyalulāla
śhrīvĕṁkaḍeśhvarum̐ḍu seri mammu daya nelĕ
seva derĕ mīgu māgum̐ jĕlulāla