Ela mammu bhramayimche rimkaa meeru

ఏల మమ్ము భ్రమయించే రింకా మీరు
Language

(॥పల్లవి॥)
ఏల మమ్ము భ్రమయించే రింకా మీరు
యేలినవాఁడు హరి యెంచి చూడరాదా

(॥ఏల॥)
సెలవుల నవ్వేది చెక్కుచేత ములిగేది
కలికికాంతల కివి కలవేకావా
పలుకుల నొరసేది భావముల మురిసేది
జలజాక్షులకు నివి సహజమే కాదా

(॥ఏల॥)
వోరగండ్లఁ జూచేది వొంటిఁ జెయిచాఁచేది
దారకపుసతులకుఁ దగవేకాదా
వోరికొట్లు కొట్లేది వున్నట్లే సిగ్గువడేది
కోరికసతుల కివి గుణములేకావా

(॥ఏల॥)
యెంగిలిమోవు లిచ్చేది యిటు చన్నులఁ గుచ్చేది
ముంగిటిరమణులకు ముక్కెమేకాదా
సంగతి శ్రీ వేంకటేశు శరణంటి మిఁక మీ
వెంగలిచేఁతలు మాతో విరసమేకాదా

(||pallavi||)
ela mammu bhramayiṁche riṁkā mīru
yelinavām̐ḍu hari yĕṁchi sūḍarādā

(||ela||)
sĕlavula navvedi sĕkkuseda muligedi
kaligigāṁtala kivi kalavegāvā
palugula nŏrasedi bhāvamula murisedi
jalajākṣhulagu nivi sahajame kādā

(||ela||)
voragaṁḍlam̐ jūsedi vŏṁṭim̐ jĕyisām̐sedi
dāragabusadulagum̐ dagavegādā
vorigŏṭlu kŏṭledi vunnaṭle sigguvaḍedi
korigasadula kivi guṇamulegāvā

(||ela||)
yĕṁgilimovu lichchedi yiḍu sannulam̐ guchchedi
muṁgiḍiramaṇulagu mukkĕmegādā
saṁgadi śhrī veṁkaḍeśhu śharaṇaṁṭi mim̐ka mī
vĕṁgalisem̐talu mādo virasamegādā