ఏల మానుఁ దొల్లి చెలి యేమేమి సేసిన దెల్ల
(॥పల్లవి॥)
ఏల మానుఁ దొల్లి చెలి యేమేమి సేసిన దెల్ల-
కాలముతో రమణుఁడు కనిపించుఁ గాకా
(॥ఏల॥)
దొంతరపువ్వుల మరుఁ దొల్లి పూజించఁగఁ బోలు
కాంత చెక్కుచేత నేఁడు గదియించెను
పొంతనే కమ్మర పైఁడిపువ్వులఁ బూజించఁ బోలు
కాంతలతో విరహగ్నిఁ గరఁగీ లోలోనే
(॥ఏల॥)
మొదల మాణిక్యముల ముగ్గులు వెట్టఁగఁ బోల
వెదచల్లి నేరు లెల్ల వీఁపుపై నేఁడు
కదిసి వ్రాఁత చీరలు గట్టఁ బోలు మేలు కట్టు
వదలి నేలల వ్రాఁత వ్రాసీఁ బాదానను
(॥ఏల॥)
తగఁబన్నీరుచెంబులు దానము లియ్యఁగఁ బోలు
మగువపై చెమట లుమ్మగిలీ నేఁడు
పగటు శ్రీవేంకటాద్రిపతి యిట్టే విచ్చేసి
అగడుగా నిటు గూడె నటు నోమఁ బోలునే
(||pallavi||)
ela mānum̐ dŏlli sĕli yememi sesina dĕlla-
kālamudo ramaṇum̐ḍu kanibiṁchum̐ gāgā
(||ela||)
dŏṁtarabuvvula marum̐ dŏlli pūjiṁcham̐gam̐ bolu
kāṁta sĕkkuseda nem̐ḍu gadiyiṁchĕnu
pŏṁtane kammara paim̐ḍibuvvulam̐ būjiṁcham̐ bolu
kāṁtalado virahagnim̐ garam̐gī lolone
(||ela||)
mŏdala māṇikyamula muggulu vĕṭṭam̐gam̐ bola
vĕdasalli neru lĕlla vīm̐pubai nem̐ḍu
kadisi vrām̐ta sīralu gaṭṭam̐ bolu melu kaṭṭu
vadali nelala vrām̐ta vrāsīm̐ bādānanu
(||ela||)
tagam̐bannīrusĕṁbulu dānamu liyyam̐gam̐ bolu
maguvabai sĕmaḍa lummagilī nem̐ḍu
pagaḍu śhrīveṁkaḍādribadi yiṭṭe vichchesi
agaḍugā niḍu gūḍĕ naḍu nomam̐ bolune