ఏల మాను నిద్దరికి నిటువంటి పొందులు
(॥పల్లవి॥)
ఏల మాను నిద్దరికి నిటువంటి పొందులు
వేళాయఁ జెలికడకు విచ్చేయవయ్యా
(॥ఏల॥)
చెలికన్నుల నంటెను సింగారపు నీరూపు
నిలిచెఁ బాదములందు నీపై తమి
వలపు శిరసు కెక్కె వనితకు నీకుఁగానే
కలిగె నెన్నడుమను కందువ నీగుణము
(॥ఏల॥)
యింతిమదిలోఁ బెరిగీ నిదె నీపై కోరికెలు
పంతము చన్నుఁగొండలపై నాటెను
వంతుకు నీవుంగరము వనితవేల నున్నది
వింతాయ నీ విలువిద్య వెలఁదిబొమ్మలను
(॥ఏల॥)
మగువ నీబుద్దు లెల్లా మనసాయ రతివేళ
తగె నీ ప్రేమ కలికితనమునను
నగుతా శ్రీవేంకటేశ నాతి గలసితి విట్టె
పగటు లిద్దరికిని పాయమున నిలిచె
(||pallavi||)
ela mānu niddarigi niḍuvaṁṭi pŏṁdulu
veḽāyam̐ jĕligaḍagu vichcheyavayyā
(||ela||)
sĕligannula naṁṭĕnu siṁgārabu nīrūbu
nilisĕm̐ bādamulaṁdu nībai tami
valabu śhirasu kĕkkĕ vanidagu nīgum̐gāne
kaligĕ nĕnnaḍumanu kaṁduva nīguṇamu
(||ela||)
yiṁtimadilom̐ bĕrigī nidĕ nībai korigĕlu
paṁtamu sannum̐gŏṁḍalabai nāḍĕnu
vaṁtugu nīvuṁgaramu vanidavela nunnadi
viṁtāya nī viluvidya vĕlam̐dibŏmmalanu
(||ela||)
maguva nībuddu lĕllā manasāya radiveḽa
tagĕ nī prema kaligidanamunanu
nagudā śhrīveṁkaḍeśha nādi galasidi viṭṭĕ
pagaḍu liddarigini pāyamuna nilisĕ