ఏల మాను నీ వోజ యెఁ(యెం?)తైనాను
(॥పల్లవి॥)
ఏల మాను నీ వోజ యెఁ(యెం?)తైనాను
నాలితోడ చెలులెల్లా నవ్వేరు నిన్నును
(॥ఏల॥)
వొట్టుక వెన్నలనాఁడు వుట్లెక్కి పెద్దవై
యిట్టె రుక్మిణి పెండ్లి తేరెక్కితివి
చిట్టికాన చిన్ననాఁడు సేసినట్టు సేసితివి
నెట్టన నింతదొరవై నేఁడు సేయవలెనా
(॥ఏల॥)
పసిబాలనాఁడు నీవు బండికి బాదము చాఁచి
దెసల నర్జునుబండితేరు నెక్కితి
శిసువవై నాఁడేమి సేసినా నమరుఁగాక
కొస రింతవాఁడవై యాగుణములే వలెనా
(॥ఏల॥)
చిన్ననాఁడు గొల్లెతలఁ జేరి చనుఁగొండలెక్కి
చిన్నియారథమెక్కితి శ్రీవేంకటాద్రి
పిన్న నాఁటిచేఁతలే పెద్దనాఁడుఁ జేసితి
వెన్న అలమేల్‌మంగ నెనసింతవలెనా
(||pallavi||)
ela mānu nī voja yĕm̐(yĕṁ?)tainānu
nālidoḍa sĕlulĕllā navveru ninnunu
(||ela||)
vŏṭṭuga vĕnnalanām̐ḍu vuṭlĕkki pĕddavai
yiṭṭĕ rukmiṇi pĕṁḍli terĕkkidivi
siṭṭigāna sinnanām̐ḍu sesinaṭṭu sesidivi
nĕṭṭana niṁtadŏravai nem̐ḍu seyavalĕnā
(||ela||)
pasibālanām̐ḍu nīvu baṁḍigi bādamu sām̐si
dĕsala narjunubaṁḍideru nĕkkidi
śhisuvavai nām̐ḍemi sesinā namarum̐gāga
kŏsa riṁtavām̐ḍavai yāguṇamule valĕnā
(||ela||)
sinnanām̐ḍu gŏllĕdalam̐ jeri sanum̐gŏṁḍalĕkki
sinniyārathamĕkkidi śhrīveṁkaḍādri
pinna nām̐ṭisem̐tale pĕddanām̐ḍum̐ jesidi
vĕnna alamelmaṁga nĕnasiṁtavalĕnā