Ela maadom jellam bette vemmelu neevu

ఏల మాతోఁ జెల్లఁ బెట్టే వెమ్మెలు నీవు
Language

(॥పల్లవి॥)
ఏల మాతోఁ జెల్లఁ బెట్టే వెమ్మెలు నీవు
నాలి సేయ కిఁక నీవు నవ్వు వచ్చీ మాకు

(॥ఏల॥)
పంత మేల నీవు నాతోఁ బచరించే వప్పటిని
యెంత లేదు ని న్నిందఁరు నెరఁగనిదా
కాంత యైతేఁ జాలు నీవు కడు గుజ్జైనాఁ గాని
చింత దీర భోగించి సేస వెట్టవా

(॥ఏల॥)
వాసు లేల నెరుపేపు వచ్చి వచ్చి నా ముందర
నీ సుద్దులు మా కెల్ల నేఁడు గొత్తలా
ఆసపడి ఆఁటదాని కడవు లెల్లాఁ దిరిగి
రాసి కెక్కఁ దెచ్చుకొని రవ్వఁ బడవా

(॥ఏల॥)
కడుఁ బరా కే లయ్యేవు గక్కన ధీరునివలె
ఆడరి శ్రీవెంకటేశ ఆడ వలెనా
మెడఁ గట్టుకొంటి విదె మించి యలమేల్‌మంగను
తొడిఁబడ నన్నుఁ గూడి దొరవై నిలువవా

(||pallavi||)
ela mādom̐ jĕllam̐ bĕṭṭe vĕmmĕlu nīvu
nāli seya kim̐ka nīvu navvu vachchī māgu

(||ela||)
paṁta mela nīvu nādom̐ basariṁche vappaḍini
yĕṁta ledu ni nniṁdam̐ru nĕram̐ganidā
kāṁta yaidem̐ jālu nīvu kaḍu gujjainām̐ gāni
siṁta dīra bhogiṁchi sesa vĕṭṭavā

(||ela||)
vāsu lela nĕrubebu vachchi vachchi nā muṁdara
nī suddulu mā kĕlla nem̐ḍu gŏttalā
āsabaḍi ām̐ṭadāni kaḍavu lĕllām̐ dirigi
rāsi kĕkkam̐ dĕchchugŏni ravvam̐ baḍavā

(||ela||)
kaḍum̐ barā ke layyevu gakkana dhīrunivalĕ
āḍari śhrīvĕṁkaḍeśha āḍa valĕnā
mĕḍam̐ gaṭṭugŏṁṭi vidĕ miṁchi yalamel‌maṁganu
tŏḍim̐baḍa nannum̐ gūḍi dŏravai niluvavā