Ela lomgevu raamgade yidivo nee ramanumdu

ఏల లోఁగేవు రాఁగదే యిదివో నీ రమణుఁడు
Language

(॥పల్లవి॥)
ఏల లోఁగేవు రాఁగదే యిదివో నీ రమణుఁడు
నాలిసేయరాదు గాని నవ్వు నవ్వవచ్చును

(॥ఏల॥)
మచ్చరమే వద్దుగాని మాటలన్నీ వాడవచ్చు
అచ్చముగా మగనితో నంగనలకు
కుచ్చితే సేయరాదు కోరి జంకించవచ్చు
రచ్చకెక్కవలచినరసికులకు

(॥ఏల॥)
పంతమాడవద్దుగాని పట్టిపెనఁగఁగఁవచ్చు
వింతలుగా రమణికి విభునితోను
చెంతఁ బాయరాదుగాని సేవలు సేయఁగవచ్చు
సంతసాన మేలమాడేసరసులకు

(॥ఏల॥)
వేసరఁగరాదుగాని వేడుకలు చూపవచ్చు
ఆసపడ్డనాధునితో నతివలకు
చేసూటిగా నిన్ను నేలె శ్రీవేంకటేశ్వరుఁడు
యీసులేదు మీవంటియితవరులకును

(||pallavi||)
ela lom̐gevu rām̐gade yidivo nī ramaṇum̐ḍu
nāliseyarādu gāni navvu navvavachchunu

(||ela||)
machcharame vaddugāni māḍalannī vāḍavachchu
achchamugā maganido naṁganalagu
kuchchide seyarādu kori jaṁkiṁchavachchu
rachchagĕkkavalasinarasigulagu

(||ela||)
paṁtamāḍavaddugāni paṭṭibĕnam̐gam̐gam̐vachchu
viṁtalugā ramaṇigi vibhunidonu
sĕṁtam̐ bāyarādugāni sevalu seyam̐gavachchu
saṁtasāna melamāḍesarasulagu

(||ela||)
vesaram̐garādugāni veḍugalu sūbavachchu
āsabaḍḍanādhunido nadivalagu
sesūḍigā ninnu nelĕ śhrīveṁkaḍeśhvarum̐ḍu
yīsuledu mīvaṁṭiyidavarulagunu