Ela lomgevu neesemta neege yerimgeenamtaa

ఏల లోఁగేవు నీచేఁత నీకె యెరిఁగీనంటా
Language

(॥పల్లవి॥)
ఏల లోఁగేవు నీచేఁత నీకె యెరిఁగీనంటా
తాలిమిగల దాపెకు తగ నిన్నుఁ బాయదు

(॥ఏల॥)
చనవు సేసుక వచ్చి సతి నిన్నుఁ జెనకఁగా
పెనఁగి యేమిటికిఁ దప్పించుకొనేవు
కనుఁగొని యిట్టె నీ చక్కఁదనాలు వొగడఁగా
ననిచి సెలవులను నవ్వులేల నవ్వేవు

(॥ఏల॥)
పలుమారు నీవున్న బాటులకు మెచ్చఁగాను
చెలఁగి నీవిందుకెంత సిగ్గువడేవు
మలసిమలసి నీతో మంచిమాట లాడఁగాను
తిలకించి చూచి పచ్చితిట్టు దిట్టనేఁటికి

(॥ఏల॥)
కూరిమి నీ సుద్దులకు కుచ్చికాఁగిలించుకోఁగా
తారుకాణించుమనేల తలవంచేవు
యీరీతి శ్రీవేంకటేశ యీకే నిన్నుఁ బెండ్లాడె
గారవించి ఇపు డెంత కప్పర మిచ్చేవు

(||pallavi||)
ela lom̐gevu nīsem̐ta nīgĕ yĕrim̐gīnaṁṭā
tālimigala dābĕgu taga ninnum̐ bāyadu

(||ela||)
sanavu sesuga vachchi sadi ninnum̐ jĕnagam̐gā
pĕnam̐gi yemiḍigim̐ dappiṁchugŏnevu
kanum̐gŏni yiṭṭĕ nī sakkam̐danālu vŏgaḍam̐gā
nanisi sĕlavulanu navvulela navvevu

(||ela||)
palumāru nīvunna bāḍulagu mĕchcham̐gānu
sĕlam̐gi nīviṁdugĕṁta sigguvaḍevu
malasimalasi nīdo maṁchimāḍa lāḍam̐gānu
tilagiṁchi sūsi pachchidiṭṭu diṭṭanem̐ṭigi

(||ela||)
kūrimi nī suddulagu kuchchigām̐giliṁchugom̐gā
tārugāṇiṁchumanela talavaṁchevu
yīrīdi śhrīveṁkaḍeśha yīge ninnum̐ bĕṁḍlāḍĕ
gāraviṁchi ibu ḍĕṁta kappara michchevu