ఏల లోఁగేవే పతి నేమిసేసినా నేమాయ
(॥పల్లవి॥)
ఏల లోఁగేవే పతి నేమిసేసినా నేమాయ
మేలుగలదానవు మెరయఁగ వచ్చును
(॥ఏల॥)
పంతమాడరాదు గాని పలుమారుఁ జెలులకు
చెంతనుండి విన్నపాలు సేయవచ్చును
వింత చూపరాదు గాని విభునితో సారెసారె
సంతోసానఁ గూరిములు సాదించవచ్చును
(॥ఏల॥)
కక్కసించరాదుగాని కడుఁ దమకముతోడ
చెక్కునొక్కి కొనగోరఁ జిమ్మవచ్చును
వెక్కసాలు వద్దుగాని వెస నిమ్మపంట వేసి
నిక్కిచూచి లాకొట్టులు నెరపఁగవచ్చును
(॥ఏల॥)
పెనఁగరాదు బీరముతో గాఁగిలించి
వొనరఁగ నీచన్నుల నొత్తవచ్చును
యెనసె శ్రీవేంకటేశుఁ డిట్టె యలమేల్మంగవు
ననిచి యీతనితోడ నవ్వు నవ్వవచ్చును
(||pallavi||)
ela lom̐geve padi nemisesinā nemāya
melugaladānavu mĕrayam̐ga vachchunu
(||ela||)
paṁtamāḍarādu gāni palumārum̐ jĕlulagu
sĕṁtanuṁḍi vinnabālu seyavachchunu
viṁta sūbarādu gāni vibhunido sārĕsārĕ
saṁtosānam̐ gūrimulu sādiṁchavachchunu
(||ela||)
kakkasiṁcharādugāni kaḍum̐ damagamudoḍa
sĕkkunŏkki kŏnagoram̐ jimmavachchunu
vĕkkasālu vaddugāni vĕsa nimmabaṁṭa vesi
nikkisūsi lāgŏṭṭulu nĕrabam̐gavachchunu
(||ela||)
pĕnam̐garādu bīramudo gām̐giliṁchi
vŏnaram̐ga nīsannula nŏttavachchunu
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ yalamelmaṁgavu
nanisi yīdanidoḍa navvu navvavachchunu