ఏల లోకులకుఁ జూపే వింద్రాదులఁ బితరుల
(॥పల్లవి॥)
ఏల లోకులకుఁ జూపే వింద్రాదులఁ బితరుల
యీ లీల నిన్నుఁ బూజించే దెక్కుడు గాఁబోలును
(॥ఏల॥)
యిక్కువ గొల్లలు చేసే యింద్రయాగము మాన్పి
నిక్కి కొండకుఁ జేయించి నీవే భుజించితివి
వెక్కసమై కిరీటి గావించే శివపూజ మాన్పి
గక్కన మోఁకాలఁ బూజ గావింపించుకొంటివి
(॥ఏల॥)
ముంచి మీఁదుగాఁ జేసిన మునుల యజ్ఞాన్నములు
కొంచక నీవు దెప్పించుకొంటి వా సతులచేత
పొంచి దూర్వా సడిగిన భోజనము లటు మాన్పి
అంచెఁ బాండవుల బలుసాకునాఁ దృప్తైతివి
(॥ఏల॥)
సారె గోపికలిండ్ల జన్నె వట్టినది మాన్పి
నేరుపుతోఁ బాలు వెన్న నీవే యారగించితివి
ధారుణిలో వేదోక్తధర్మము నీవే నిలిపి
కారణ మింతకు శ్రీవేంకటేశ నీ వైతివి
(||pallavi||)
ela logulagum̐ jūbe viṁdrādulam̐ bidarula
yī līla ninnum̐ būjiṁche dĕkkuḍu gām̐bolunu
(||ela||)
yikkuva gŏllalu sese yiṁdrayāgamu mānpi
nikki kŏṁḍagum̐ jeyiṁchi nīve bhujiṁchidivi
vĕkkasamai kirīḍi gāviṁche śhivabūja mānpi
gakkana mom̐kālam̐ būja gāviṁpiṁchugŏṁṭivi
(||ela||)
muṁchi mīm̐dugām̐ jesina munula yajñānnamulu
kŏṁchaga nīvu dĕppiṁchugŏṁṭi vā sadulaseda
pŏṁchi dūrvā saḍigina bhojanamu laḍu mānpi
aṁchĕm̐ bāṁḍavula balusāgunām̐ dṛptaidivi
(||ela||)
sārĕ gobigaliṁḍla jannĕ vaṭṭinadi mānpi
nerubudom̐ bālu vĕnna nīve yāragiṁchidivi
dhāruṇilo vedoktadharmamu nīve nilibi
kāraṇa miṁtagu śhrīveṁkaḍeśha nī vaidivi