Ela kottalu sesevu ippude naado

ఏల కొత్తలు సేసేవు ఇప్పుడే నాతో
Language

(॥పల్లవి॥)
ఏల కొత్తలు సేసేవు ఇప్పుడే నాతో
మేలుతోడిదాననౌత మిక్కిలి నెఱఁగవా

(॥ఏల॥)
కనుచూపులనేచూచి కాఁక లెంత చేసేవు
ననుపు చూపి యెంత నమ్మించేవు
మనసులు సోదించి మర్మమేల వెదకేవు
యెనసి మోహించిన దెరఁగవా నీవు

(॥ఏల॥)
తరితీపులనుఁబెట్టి తమక మేల రేఁచేవు
పొరుగున నుండి యేమి పొద్దువుచ్చేవు
సరసములే యాడి చవులెంత మరపేవు
ఇరవైన దాననౌత యెరఁగవా నీవు

(॥ఏల॥)
అసలనే చిక్కించి ఆయము లేఁటి కంటేవు
సేసవెట్టి నీవెట్టు సిగ్గుదేర్చేవు
వాసితోనన్నేలితివి వరుస శ్రీవేంకటేశ
యీసరి నలమేల్మంగ నెఱఁగవా నీవు

(||pallavi||)
ela kŏttalu sesevu ippuḍe nādo
meludoḍidānanauda mikkili nĕṟam̐gavā

(||ela||)
kanusūbulanesūsi kām̐ka lĕṁta sesevu
nanubu sūbi yĕṁta nammiṁchevu
manasulu sodiṁchi marmamela vĕdagevu
yĕnasi mohiṁchina dĕram̐gavā nīvu

(||ela||)
taridībulanum̐bĕṭṭi tamaga mela rem̐sevu
pŏruguna nuṁḍi yemi pŏdduvuchchevu
sarasamule yāḍi savulĕṁta marabevu
iravaina dānanauda yĕram̐gavā nīvu

(||ela||)
asalane sikkiṁchi āyamu lem̐ṭi kaṁṭevu
sesavĕṭṭi nīvĕṭṭu siggudersevu
vāsidonannelidivi varusa śhrīveṁkaḍeśha
yīsari nalamelmaṁga nĕṟam̐gavā nīvu