ఏల కూరిమి గొసరే విప్పుడు నన్ను
(॥పల్లవి॥)
ఏల కూరిమి గొసరే విప్పుడు నన్ను
వాలాయించి నీవాపెకు వసమై వున్నాఁడవు
(॥॥)
తమకించి నే నిన్ను దప్పులుదేరిచేనంటే
అమరునా నీవద్దనాపె వుండఁగా
సముకాన నుండి మోవిచవులు చూపేనంటే
తెమలేవా ఆపె తరితీపులు నున్నాఁడవు
(॥॥)
వెస నాముచ్చటలెల్లా వేడుక జెప్పే నంటే
బొసఁగునా ఆపె నీతో బొందు సేయగా
రసికత నీతో సరసము లాడేనంటే
అస మిచ్చేవా ఆపై ఆసల నున్నాఁడవు
(॥॥)
సతమై నీకుఁ బచ్చడము గప్పేనంటే
ఇతవౌనా ఆపె నిన్ను నెనయఁగను
పతివై నన్నేలితివి బాగుగా శ్రీ వేంకటేశ
తతిఁ గాదనేనా ఇందరిఁ గూడున్నాఁడవు
(||pallavi||)
ela kūrimi gŏsare vippuḍu nannu
vālāyiṁchi nīvābĕgu vasamai vunnām̐ḍavu
(||||)
tamagiṁchi ne ninnu dappuluderisenaṁṭe
amarunā nīvaddanābĕ vuṁḍam̐gā
samugāna nuṁḍi movisavulu sūbenaṁṭe
tĕmalevā ābĕ taridībulu nunnām̐ḍavu
(||||)
vĕsa nāmuchchaḍalĕllā veḍuga jĕppe naṁṭe
bŏsam̐gunā ābĕ nīdo bŏṁdu seyagā
rasigada nīdo sarasamu lāḍenaṁṭe
asa michchevā ābai āsala nunnām̐ḍavu
(||||)
sadamai nīgum̐ bachchaḍamu gappenaṁṭe
idavaunā ābĕ ninnu nĕnayam̐ganu
padivai nannelidivi bāgugā śhrī veṁkaḍeśha
tadim̐ gādanenā iṁdarim̐ gūḍunnām̐ḍavu