ఏల కొంగు పట్టేవు మేరుపరచుమంటాను
(॥పల్లవి॥)
ఏల కొంగు పట్టేవు మేరుపరచుమంటాను
ఆలరి వనుచు సారె నాడేనా నిన్నును
(॥ఏల॥)
వేడుకకు వెల లేదు వెన్నెల కడ్డము లేదు
వాడికెకు నీకు నెందు వావి లేదు
కోడెకాడఁ నీవీ మాఁట గొల్లెతలనే యడుగు
పాడితోఁ జీకఁటితప్పు పట్టితినా నిన్నును
(॥ఏల॥)
కోరికకుఁ దుదిలేదు గుట్టు తుమ్మిదకు లేదు
వారించి నీ గుణముల వంకర వోదు
గారవపు నీమాఁట గందము కుబ్జ నడుగు
పేరుకొని నే నారడిఁ బెట్టేనా నిన్నును
(॥ఏల॥)
నగవుకు వేళలేదు ననలకుఁ గంపు లేదు
తగిన నీ మనసుకు తనివి రాదు
నిగిడి శ్రీ వేంకటేశ నీవే నన్ను నడుగు
సొగిసి నన్నుఁ గూడితి సోదించేనా నిన్నును
(||pallavi||)
ela kŏṁgu paṭṭevu merubarasumaṁṭānu
ālari vanusu sārĕ nāḍenā ninnunu
(||ela||)
veḍugagu vĕla ledu vĕnnĕla kaḍḍamu ledu
vāḍigĕgu nīgu nĕṁdu vāvi ledu
koḍĕgāḍam̐ nīvī mām̐ṭa gŏllĕdalane yaḍugu
pāḍidom̐ jīgam̐ṭidappu paṭṭidinā ninnunu
(||ela||)
korigagum̐ dudiledu guṭṭu tummidagu ledu
vāriṁchi nī guṇamula vaṁkara vodu
gāravabu nīmām̐ṭa gaṁdamu kubja naḍugu
perugŏni ne nāraḍim̐ bĕṭṭenā ninnunu
(||ela||)
nagavugu veḽaledu nanalagum̐ gaṁpu ledu
tagina nī manasugu tanivi rādu
nigiḍi śhrī veṁkaḍeśha nīve nannu naḍugu
sŏgisi nannum̐ gūḍidi sodiṁchenā ninnunu