Ela kobagimchugone vimdugum gaanu

ఏల కోపగించుకొనే విందుకుఁ గాను
Language

(॥పల్లవి॥)
ఏల కోపగించుకొనే విందుకుఁ గాను
తాలిమి నీ మతి కిది తనివిగాదా

(॥ఏల॥)
జంగిలిసతుల నిన్ను సారెసారెఁ గూడఁగట్టి
వెంగేలు నే నాడితేను వేడుకగాదా
అంగజముద్రలు నీపై నట్టె నెలకొనెనంటే
అంగడిఁ బెద్దరికము అది నీకుఁ గాదా

(॥ఏల॥)
కందువైన వలపులకతలలో నిన్నుఁ గూర్చి
ఇందరితో జెప్పితేను ఇంపులుగావా
దిందుపడె నూరివారితిట్లు నీకుఁ జెప్పితే(?)
విందుల నీవీనులకు వంతలుగావా

(॥ఏల॥)
అయాలంటాసందడిలో నాఁడువారి నంటించితే
పాయపునీమదానకు బలిమిగాదా
యీయెడ శ్రీవేంకటేశ ఇట్టె నన్నుఁ గూడితివి
లాయపురతులు నీకు లక్షణాలుగావా

(||pallavi||)
ela kobagiṁchugŏne viṁdugum̐ gānu
tālimi nī madi kidi tanivigādā

(||ela||)
jaṁgilisadula ninnu sārĕsārĕm̐ gūḍam̐gaṭṭi
vĕṁgelu ne nāḍidenu veḍugagādā
aṁgajamudralu nībai naṭṭĕ nĕlagŏnĕnaṁṭe
aṁgaḍim̐ bĕddarigamu adi nīgum̐ gādā

(||ela||)
kaṁduvaina valabulagadalalo ninnum̐ gūrsi
iṁdarido jĕppidenu iṁpulugāvā
diṁdubaḍĕ nūrivāridiṭlu nīgum̐ jĕppide(?)
viṁdula nīvīnulagu vaṁtalugāvā

(||ela||)
ayālaṁṭāsaṁdaḍilo nām̐ḍuvāri naṁṭiṁchide
pāyabunīmadānagu balimigādā
yīyĕḍa śhrīveṁkaḍeśha iṭṭĕ nannum̐ gūḍidivi
lāyaburadulu nīgu lakṣhaṇālugāvā