ఏల కిందుపడేవు నాకెంత ప్రియాలు చెప్పేవు
(॥పల్లవి॥)
ఏల కిందుపడేవు నాకెంత ప్రియాలు చెప్పేవు
యేలాగు నడచినా యెదురేది నీకును
(॥ఏల॥)
కల్లలాడవద్దు గాని కడఁ బొందు సేసి వచ్చి
చల్లఁగా నాతోఁ జెప్పితే సంతోసించనా
చెల్లదా నీకేమైనా చేసిన చేఁతలెల్లా
బల్లిదుఁడవు తొలుతే భయమేల నీకును
(॥ఏల॥)
మూసి దాఁచవద్దుగాని మోహమెందు గలిగినా
ఆసతి దోడి తెమ్మంటే నౌఁగాదనేనా
దోసమెంచేరా నిన్ను దొరవు గావా నీవు
బాస ఇచ్చి ఇఁక సిగ్గువడనేల నీకును
(॥ఏల॥)
వాదించ వద్దుగాని వాడవారిఁ గూడినాను
సాదవై నావద్దనుంటే సమ్మతించనా
యీదెస శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
ఆదుకొన రతులబ్బె నల పేల మీకును
(||pallavi||)
ela kiṁdubaḍevu nāgĕṁta priyālu sĕppevu
yelāgu naḍasinā yĕduredi nīgunu
(||ela||)
kallalāḍavaddu gāni kaḍam̐ bŏṁdu sesi vachchi
sallam̐gā nādom̐ jĕppide saṁtosiṁchanā
sĕlladā nīgemainā sesina sem̐talĕllā
ballidum̐ḍavu tŏlude bhayamela nīgunu
(||ela||)
mūsi dām̐savaddugāni mohamĕṁdu galiginā
āsadi doḍi tĕmmaṁṭe naum̐gādanenā
dosamĕṁcherā ninnu dŏravu gāvā nīvu
bāsa ichchi im̐ka sigguvaḍanela nīgunu
(||ela||)
vādiṁcha vaddugāni vāḍavārim̐ gūḍinānu
sādavai nāvaddanuṁṭe sammadiṁchanā
yīdĕsa śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
ādugŏna radulabbĕ nala pela mīgunu