(॥పల్లవి॥)
ఏల కరఁగఁడే మన సిందాఁకాను
యేలికంటాఁ జూచితినే యిందాఁకాను
(॥ఏల॥)
వచ్చినట్టే వచ్చితిని వాడవారి మెప్పించితి
యిచ్చకమాడితిఁ దన కిందాఁకాను
మచ్చరించనైతి తొంటిఁమాటలు నొప్పగించితి
యెచ్చరికలే సేసితి నిందాఁకాను
(॥ఏల॥)
సన్నలకు లోనైతి చవులెల్లాఁ జూపితిని
యిన్నటాఁ జుట్టమనైతి నిందాఁకాను
తన్ను నేమీఁ గోపగించ తప్పులువట్టను నేను
యెన్నుకొని మొక్కితిని ఇందాఁకాను
(॥ఏల॥)
అదను గాచుకుండితి నట్టే కాంగిటఁ గూడితి
ఇదివో శ్రీవేంకటేశ ఇందాఁకాను
పదరఁ డీతఁడే చేపట్టి నన్ను మన్నించె
యెదుట నవ్వులు నవ్వె యిందాఁకాను
(||pallavi||)
ela karam̐gam̐ḍe mana siṁdām̐kānu
yeligaṁṭām̐ jūsidine yiṁdām̐kānu
(||ela||)
vachchinaṭṭe vachchidini vāḍavāri mĕppiṁchidi
yichchagamāḍidim̐ dana kiṁdām̐kānu
machchariṁchanaidi tŏṁṭim̐māḍalu nŏppagiṁchidi
yĕchcharigale sesidi niṁdām̐kānu
(||ela||)
sannalagu lonaidi savulĕllām̐ jūbidini
yinnaḍām̐ juṭṭamanaidi niṁdām̐kānu
tannu nemīm̐ gobagiṁcha tappuluvaṭṭanu nenu
yĕnnugŏni mŏkkidini iṁdām̐kānu
(||ela||)
adanu gāsuguṁḍidi naṭṭe kāṁgiḍam̐ gūḍidi
idivo śhrīveṁkaḍeśha iṁdām̐kānu
padaram̐ ḍīdam̐ḍe sebaṭṭi nannu manniṁchĕ
yĕduḍa navvulu navvĕ yiṁdām̐kānu