ఏల కైలాటాలు వెట్టే విదేమోయి
(॥పల్లవి॥)
ఏల కైలాటాలు వెట్టే విదేమోయి
పేలరివై మామీఁదఁ బెట్టేవా వోయీ
(॥ఏల॥)
బుద్దులు చెప్పితినట పొంచి నీకు నేనంటా
గద్దించీ యీకె నన్ను కద్దా వోయి
వద్దవుండకుండా నేనే వలలఁబెట్టితినట
అద్దుకొని మాఁటలాడీ నది గద్దా వోయి
(॥ఏల॥)
గెర వా(వ్రా?) సితినట యా కెఇంటికి నేఁగకుండా
కరకరించీ నాపె కద్దా వోఇ
కొరకొర కాను కందుకొనకుండాఁ జేసితినట
ఆరసీఁదానే మర్మాలు అవునా వోయి
(॥ఏల॥)
సన్నలు సేసితినట సారె నన్నుఁ గూడుమని
కన్నుల నవ్వీ నాపె కద్దా వోయి
యెన్నఁగ శ్రీవేంకటేశ యిద్దరి మమ్మేలితివి
నిన్ను నే సాకిరిగోరే నిజమా వోయి
(||pallavi||)
ela kailāḍālu vĕṭṭe videmoyi
pelarivai māmīm̐dam̐ bĕṭṭevā voyī
(||ela||)
buddulu sĕppidinaḍa pŏṁchi nīgu nenaṁṭā
gaddiṁchī yīgĕ nannu kaddā voyi
vaddavuṁḍaguṁḍā nene valalam̐bĕṭṭidinaḍa
addugŏni mām̐ṭalāḍī nadi gaddā voyi
(||ela||)
gĕra vā(vrā?) sidinaḍa yā kĕiṁṭigi nem̐gaguṁḍā
karagariṁchī nābĕ kaddā voi
kŏragŏra kānu kaṁdugŏnaguṁḍām̐ jesidinaḍa
ārasīm̐dāne marmālu avunā voyi
(||ela||)
sannalu sesidinaḍa sārĕ nannum̐ gūḍumani
kannula navvī nābĕ kaddā voyi
yĕnnam̐ga śhrīveṁkaḍeśha yiddari mammelidivi
ninnu ne sāgirigore nijamā voyi