Ela kaigonevu neevu yevvarinim dalamsevu

ఏల కైకొనేవు నీవు యెవ్వరినిఁ దలఁచేవు
Language

(॥పల్లవి॥)
ఏల కైకొనేవు నీవు యెవ్వరినిఁ దలఁచేవు
జాలిఁబెట్టే యాపె పొందు చవులాయను

(॥ఏల॥)
వాలుక చూపులు నీపై వంచెఁ జెలి యవి నీకు
గాలములై నీ చిత్తము కడుఁ దగిలె
నాలిమాటలెల్ల నీతో నానవేసి యాడఁగాను
అలరి నాములై నీకు నన్ను వట్టెను

(॥ఏల॥)
పరగ సిగ్గులు నీపై నిట్టే వేయఁగాను
సిరుల వలపులెల్లఁ జిమ్మి రేఁగెను
పురికొలిపే నవ్వులు పొంచిపొంచి నవ్వఁగాను
తరితీపులై నిన్ను మరిగించెను

(॥ఏల॥)
సందునుడి నీకాపె సన్నలటు చూపఁగాను
విందులై నోరూరఁజేసె వేడుక నీకు
కందువ శ్రీవేంకటేశ కాఁగిట నిన్నుఁ గూడఁగ
అంది నన్ను నేలించి ఆసలు వుట్టించెను

(||pallavi||)
ela kaigŏnevu nīvu yĕvvarinim̐ dalam̐sevu
jālim̐bĕṭṭe yābĕ pŏṁdu savulāyanu

(||ela||)
vāluga sūbulu nībai vaṁchĕm̐ jĕli yavi nīgu
gālamulai nī sittamu kaḍum̐ dagilĕ
nālimāḍalĕlla nīdo nānavesi yāḍam̐gānu
alari nāmulai nīgu nannu vaṭṭĕnu

(||ela||)
paraga siggulu nībai niṭṭe veyam̐gānu
sirula valabulĕllam̐ jimmi rem̐gĕnu
purigŏlibe navvulu pŏṁchibŏṁchi navvam̐gānu
taridībulai ninnu marigiṁchĕnu

(||ela||)
saṁdunuḍi nīgābĕ sannalaḍu sūbam̐gānu
viṁdulai norūram̐jesĕ veḍuga nīgu
kaṁduva śhrīveṁkaḍeśha kām̐giḍa ninnum̐ gūḍam̐ga
aṁdi nannu neliṁchi āsalu vuṭṭiṁchĕnu