Ela kaasugumdaanavu yeedamdu nee magamdamtaa

ఏల కాచుకుందానవు యీతఁడు నీ మగఁడంటా
Language

(॥పల్లవి॥)
ఏల కాచుకుందానవు యీతఁడు నీ మగఁడంటా
లేలే ఆయనాయ నెఁ(నెం?)తలేదు నీ యాసోదము

(॥ఏల॥)
బలిమిగలదానవు పతిఁ బిలుచుకొరోదా
కలిగిననీపగటు కందముగాని
వెలయ నితనిచేత వీడె మిప్పించుకోరాదా
కలికితనాలెల్లాఁ గానవచ్చీ నపుడు

(॥ఏల॥)
చుట్టమవైనదానవు చొక్కవలపించరాదా
గట్టిగ నీనేరుపెల్లా గందముగాని
అట్టయితే నీతనిచేఁ బ్రియము చెప్పించుకోరాదా
దిట్టతనమెల్లాఁ దేట తెల్లమయ్యీ నపుడు

(॥ఏల॥)
పొందుగలదానవు బువ్వానఁ బెట్టుకోరదా
కందువ నీబీరమెల్లాఁ గందముగాని
చెందె నలమేల్‌మంగను శ్రీవేంకటేశుఁ డితఁడు
యిందునే నీకోరికలు నీడేరీ విపుడు

(||pallavi||)
ela kāsuguṁdānavu yīdam̐ḍu nī magam̐ḍaṁṭā
lele āyanāya nĕm̐(nĕṁ?)taledu nī yāsodamu

(||ela||)
balimigaladānavu padim̐ bilusugŏrodā
kaliginanībagaḍu kaṁdamugāni
vĕlaya nidaniseda vīḍĕ mippiṁchugorādā
kaligidanālĕllām̐ gānavachchī nabuḍu

(||ela||)
suṭṭamavainadānavu sŏkkavalabiṁcharādā
gaṭṭiga nīnerubĕllā gaṁdamugāni
aṭṭayide nīdanisem̐ briyamu sĕppiṁchugorādā
diṭṭadanamĕllām̐ deḍa tĕllamayyī nabuḍu

(||ela||)
pŏṁdugaladānavu buvvānam̐ bĕṭṭugoradā
kaṁduva nībīramĕllām̐ gaṁdamugāni
sĕṁdĕ nalamel‌maṁganu śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍu
yiṁdune nīgorigalu nīḍerī vibuḍu