ఏల కాపు సేసేవు యింతుల నీవు
(॥పల్లవి॥)
ఏల కాపు సేసేవు యింతుల నీవు
తాలిమితోఁ గాఁగిలించిఁ దయఁ జూడరాదా
(॥ఏల॥)
మన్ననగల యాఁటది మంతనాలు సారె నాడు
వన్నెలాఁడియైనది వలపించును
కన్నులకలికి వేడుకలు దైవారఁగఁ జూచు
అన్నిటాఁ జక్కనిదైతే నాసలెల్లా రేఁచును
(॥ఏల॥)
కూరిమిగలుగుకాంత కొనగోరఁ జెనకును
వోరుపు గలిగినది వొడివట్టును
గారవపుఁజేఁతలది కడు వినయాలు సేసు
కోరి వచ్చినది మంచిగుణాలు నెరపును
(॥ఏల॥)
మిక్కిలిచుట్టమైనది మెరయించుఁ బొందులెల్లా
వెక్కసపుటా సలది వేఁడుకొనును
అక్కున శ్రీవేంకటేశ యలమెల్మంగ నేలేవు
నిక్కము రతుల కీలు నీవే యెరుఁగుదువు
(||pallavi||)
ela kābu sesevu yiṁtula nīvu
tālimidom̐ gām̐giliṁchim̐ dayam̐ jūḍarādā
(||ela||)
mannanagala yām̐ṭadi maṁtanālu sārĕ nāḍu
vannĕlām̐ḍiyainadi valabiṁchunu
kannulagaligi veḍugalu daivāram̐gam̐ jūsu
anniḍām̐ jakkanidaide nāsalĕllā rem̐sunu
(||ela||)
kūrimigalugugāṁta kŏnagoram̐ jĕnagunu
vorubu galiginadi vŏḍivaṭṭunu
gāravabum̐jem̐taladi kaḍu vinayālu sesu
kori vachchinadi maṁchiguṇālu nĕrabunu
(||ela||)
mikkilisuṭṭamainadi mĕrayiṁchum̐ bŏṁdulĕllā
vĕkkasabuḍā saladi vem̐ḍugŏnunu
akkuna śhrīveṁkaḍeśha yalamĕlmaṁga nelevu
nikkamu radula kīlu nīve yĕrum̐guduvu