Ela jolisesevu yemdaamkaanu

ఏల జోలిసేసేవు యెందాఁకాను
Language

(॥పల్లవి॥)
ఏల జోలిసేసేవు యెందాఁకాను
యీ లీల నన్నివినోదా లింటిలోనే వున్నవి

(॥ఏల॥)
జలజాక్షి నవ్వులైతే చల్లు వెదలు
కలికితనములు పోఁకకుఁ బుట్టెఁడు
నిలువుఁజక్క దనము నిండుబండారు
కలిగె నీకు రావయ్య కందువల నిపుడు

(॥ఏల॥)
తరుణిపలుకులె తంగేడుజున్ను
బెరసేటివిన్నపము పెళ్లిచెట్టు
అరుదైన వలపెల్లా నట్టె కొటారు
దొరకె నీకు రావయ్యతొడిఁబడనిపుడు

(॥ఏల॥)
వనితకాఁగిటిరతి వాడనిపువ్వు
తనివోనిమోవి దొంతరబోనము
యెనసితివి శ్రీవేంకటేశ యీకెను
వొనగూడీ రావయ్య వొద్దికతోనిపుడు

(||pallavi||)
ela jolisesevu yĕṁdām̐kānu
yī līla nannivinodā liṁṭilone vunnavi

(||ela||)
jalajākṣhi navvulaide sallu vĕdalu
kaligidanamulu pom̐kagum̐ buṭṭĕm̐ḍu
niluvum̐jakka danamu niṁḍubaṁḍāru
kaligĕ nīgu rāvayya kaṁduvala nibuḍu

(||ela||)
taruṇibalugulĕ taṁgeḍujunnu
bĕraseḍivinnabamu pĕḽlisĕṭṭu
arudaina valabĕllā naṭṭĕ kŏḍāru
dŏragĕ nīgu rāvayyadŏḍim̐baḍanibuḍu

(||ela||)
vanidagām̐giḍiradi vāḍanibuvvu
tanivonimovi dŏṁtarabonamu
yĕnasidivi śhrīveṁkaḍeśha yīgĕnu
vŏnagūḍī rāvayya vŏddigadonibuḍu