ఏల జాగరాలు సేసే విటు నే నుండఁగాను
(॥పల్లవి॥)
ఏల జాగరాలు సేసే విటు నే నుండఁగాను
వేళవచ్చెఁ గూడరాదా వెఱపు మీకేఁటికి
(॥ఏల॥)
మచ్చికతో మీరిద్దరు మాటాడుకోరాదా
కచ్చుపెట్టి వాకిటఁ గాచుకుండెను
విచ్చనవిడిగా నింక విడేలుసేయరాదా
యిచ్చిపంపెఁ జెలిచేత నెన్నయినాను
(॥ఏమి॥)
గాఁటముగా నొండొరులు కాఁగిలించుకోరాదా
తేటతెల్లమి గాకుండాఁ దెరవేసేను
చాటువగా మోవితేనె చవులుగొనఁగరాదా
వూటలుగా మోమురసా లుబ్బఁజేసెను
(॥ఏమి॥)
పానుపుపై నాపె నీవూఁ బవళించి వుండరాదా
కానిమ్మని పచ్చడము గప్పె మీకును
యే నలమేలుమంగను నన్నేలితి శ్రీవేంకటేశ
పూని మీమనసు లిట్టె పొత్తుగలపేను
(||pallavi||)
ela jāgarālu sese viḍu ne nuṁḍam̐gānu
veḽavachchĕm̐ gūḍarādā vĕṟabu mīgem̐ṭigi
(||ela||)
machchigado mīriddaru māḍāḍugorādā
kachchubĕṭṭi vāgiḍam̐ gāsuguṁḍĕnu
vichchanaviḍigā niṁka viḍeluseyarādā
yichchibaṁpĕm̐ jĕliseda nĕnnayinānu
(||emi||)
gām̐ṭamugā nŏṁḍŏrulu kām̐giliṁchugorādā
teḍadĕllami gāguṁḍām̐ dĕravesenu
sāḍuvagā movidenĕ savulugŏnam̐garādā
vūḍalugā momurasā lubbam̐jesĕnu
(||emi||)
pānububai nābĕ nīvūm̐ bavaḽiṁchi vuṁḍarādā
kānimmani pachchaḍamu gappĕ mīgunu
ye nalamelumaṁganu nannelidi śhrīveṁkaḍeśha
pūni mīmanasu liṭṭĕ pŏttugalabenu