Ela imtasesevu yeṟamgavaa maa laagu

ఏల ఇంతసేసేవు యెఱఁగవా మా లాగు
Language

(॥పల్లవి॥)
ఏల ఇంతసేసేవు యెఱఁగవా మా లాగు
చాలుకొన్న మాతో నీచల మేమున్నది

(॥ఏల॥)
చిగురుఁగొమ్మాఁ జేఁగె చెలులలోపల నెల్ల
యెగసక్కేలాడఁ జోటు యేది నీకు
బిగువు చనుఁగొండలఁ బిరితియ్యరెప్పుడును
మగవాఁడవు నీకైతే మనసే మెత్తన

(॥ఏల॥)
ననల కొనలు వాఁడే నాతులలోపల నెల్ల
యెనయక వట్టిమాట లేఁటికి నీకు
కొనగోరి కత్తులతో కొంకరెంతపనికైన
ఘనుఁడవు నీకైతే కాయమే కోమలము

(॥ఏల॥)
వొగరు పూఁపలు తీపే వువిదలలో నెల్ల
యిగిలింపు నవ్వుబీరా లేల ఆడేవు
అగపడి శ్రీ వేంకటాధిప నన్నేలితివి
మగఁడవు నీవైతే మర్మమే పై పై ని

(||pallavi||)
ela iṁtasesevu yĕṟam̐gavā mā lāgu
sālugŏnna mādo nīsala memunnadi

(||ela||)
sigurum̐gŏmmām̐ jem̐gĕ sĕlulalobala nĕlla
yĕgasakkelāḍam̐ joḍu yedi nīgu
biguvu sanum̐gŏṁḍalam̐ biridiyyarĕppuḍunu
magavām̐ḍavu nīgaide manase mĕttana

(||ela||)
nanala kŏnalu vām̐ḍe nādulalobala nĕlla
yĕnayaga vaṭṭimāḍa lem̐ṭigi nīgu
kŏnagori kattulado kŏṁkarĕṁtabanigaina
ghanum̐ḍavu nīgaide kāyame komalamu

(||ela||)
vŏgaru pūm̐palu tībe vuvidalalo nĕlla
yigiliṁpu navvubīrā lela āḍevu
agabaḍi śhrī veṁkaḍādhiba nannelidivi
magam̐ḍavu nīvaide marmame pai pai ni