Ela gubbadilleru meerimtadilonane

ఏల గుబ్బతిల్లేరు మీరింతటిలోననే
Language

(॥పల్లవి॥)
ఏల గుబ్బతిల్లేరు మీరింతటిలోననే
ఆలికిని మగనికి నడ్డాఁకలున్నవా

(॥ఏల॥)
మాటలు సరివచ్చెనా మగువకు నీకును
యీటునఁ గనుఁగొనల నేమి నవ్వేరు
చోటు గలిగెనా మీకు సుద్దులెల్లాఁ జెప్పుకోను
ఆఁటదానికి మగవాని కడ్డాఁకలున్నవా

(॥ఏల॥)
తారుకాణలాయనా తరుణికి నీకును
యీరీతిఁ బెంజెమటతో నేమి నవ్వేరు
మేర గలిగెనా మీకు మెచ్చులెల్లా మెచ్చుకోను
ఆరయ సతికిఁ బతికడ్డాఁకలున్నవా

(॥ఏల॥)
రతి మర్మములంటెనా రమణికి నీకును
యితవైన చొక్కులతో నేమి నవ్వేరు
సతము గలిగెనా చవులకు శ్రీవేంకటేశ
అతివకుఁ బతివైతి వడ్డాఁకలున్నవా

(||pallavi||)
ela gubbadilleru mīriṁtaḍilonane
āligini maganigi naḍḍām̐kalunnavā

(||ela||)
māḍalu sarivachchĕnā maguvagu nīgunu
yīḍunam̐ ganum̐gŏnala nemi navveru
soḍu galigĕnā mīgu suddulĕllām̐ jĕppugonu
ām̐ṭadānigi magavāni kaḍḍām̐kalunnavā

(||ela||)
tārugāṇalāyanā taruṇigi nīgunu
yīrīdim̐ bĕṁjĕmaḍado nemi navveru
mera galigĕnā mīgu mĕchchulĕllā mĕchchugonu
āraya sadigim̐ badigaḍḍām̐kalunnavā

(||ela||)
radi marmamulaṁṭĕnā ramaṇigi nīgunu
yidavaina sŏkkulado nemi navveru
sadamu galigĕnā savulagu śhrīveṁkaḍeśha
adivagum̐ badivaidi vaḍḍām̐kalunnavā