Ela gadimchugonevu yemi neevu doorevu

ఏల గడించుకొనేవు యేమి నీవు దూరేవు
Language

(॥పల్లవి॥)
ఏల గడించుకొనేవు యేమి నీవు దూరేవు
వాలుకచూపులు గాక వాండ్లా ఇవి

(॥॥)
మంతానాన నేనాడేమాట సహజమే కాక
అంతలోనే నిన్ను వెంగెమాడుటా ఇది
చెంత నాకన్ను బొమ్మలసింగార మిట్టే కాక
పంతాన నిన్ను జంకించేపగటా ఇది

(॥॥)
నటనల నాసెలి నవ్వేజాడే కాక
సటలకు నీతో నెగసక్కెమా ఇది
ఘటన నే నిలుచుండేకట్టడే ఇదికాక
మటమాయవొడ్డారాల మారుకొనుటా ఇది

(॥॥)
నెలవై నాకాఁగిటలో నేరుపు లివే కాక
అలయించేనని పెనఁగాడుటా ఇది
యెలమి శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
కలపుకో లిది గాక కడుసాదింపా ఇది

(||pallavi||)
ela gaḍiṁchugŏnevu yemi nīvu dūrevu
vālugasūbulu gāga vāṁḍlā ivi

(||||)
maṁtānāna nenāḍemāḍa sahajame kāga
aṁtalone ninnu vĕṁgĕmāḍuḍā idi
sĕṁta nāgannu bŏmmalasiṁgāra miṭṭe kāga
paṁtāna ninnu jaṁkiṁchebagaḍā idi

(||||)
naḍanala nāsĕli navvejāḍe kāga
saḍalagu nīdo nĕgasakkĕmā idi
ghaḍana ne nilusuṁḍegaṭṭaḍe idigāga
maḍamāyavŏḍḍārāla mārugŏnuḍā idi

(||||)
nĕlavai nāgām̐giḍalo nerubu live kāga
alayiṁchenani pĕnam̐gāḍuḍā idi
yĕlami śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
kalabugo lidi gāga kaḍusādiṁpā idi