Ela gadimchugonevu yedaleni kadalunu

ఏల గడించుకొనేవు యేడలేని కతలును
Language

(॥పల్లవి॥)
ఏల గడించుకొనేవు యేడలేని కతలును
లోలోనే గుబ్బతిల్లక లోనికి రావయ్యా

(॥॥)
చిగురుమోవిమీఁద చిప్పిలుఁదేనే గారితే
వొగరుఁదిట్ల నేవు వూరకే నీవు
మగువ నీమీఁదట మచ్చరించి పలుకఁగ
నిగిడి యింతటిలోన నేవేమి సేసితివి

(॥॥)
నలిఁజంద్రవదనాను నవ్వు వెన్నెల గాసితే
అలరుచు నెగసక్కేలనేవు
చెలియ నీమీఁదట చిట్టకము నెరపఁగ
నెలకొన్నయట్టితప్పు నీవేమి సేసితివి

(॥॥)
జక్కవ చనుముక్కులు సరివాఁడు లై తేను
వుక్కునఁ గాఁగిట నిన్ను నొత్తెననేవు
అక్కున శ్రీ వేంకటేశ అలమేల్మంగ జరయ
నిక్కి పానుపుమీఁదట నీవేమి సేసితివి

(||pallavi||)
ela gaḍiṁchugŏnevu yeḍaleni kadalunu
lolone gubbadillaga lonigi rāvayyā

(||||)
sigurumovimīm̐da sippilum̐dene gāride
vŏgarum̐diṭla nevu vūrage nīvu
maguva nīmīm̐daḍa machchariṁchi palugam̐ga
nigiḍi yiṁtaḍilona nevemi sesidivi

(||||)
nalim̐jaṁdravadanānu navvu vĕnnĕla gāside
alarusu nĕgasakkelanevu
sĕliya nīmīm̐daḍa siṭṭagamu nĕrabam̐ga
nĕlagŏnnayaṭṭidappu nīvemi sesidivi

(||||)
jakkava sanumukkulu sarivām̐ḍu lai tenu
vukkunam̐ gām̐giḍa ninnu nŏttĕnanevu
akkuna śhrī veṁkaḍeśha alamelmaṁga jaraya
nikki pānubumīm̐daḍa nīvemi sesidivi