Ela doorevayyaa yedagalashumti namtaa

ఏల దూరేవయ్యా యెడగలశుంటి నంటా
Language

(॥పల్లవి॥)
ఏల దూరేవయ్యా యెడగలశుంటి నంటా
వోలివెట్టి పెండ్లాడఁగ నొరయఁగ వచ్చునా

(॥॥)
ఇద్దరును మీరిట్టే యేకతములాడఁగాను
వొద్దికి రావచ్చునా వూరకే నేను
పెద్దరికములకును పెనగుఁలాటాడఁగాను
అదలించి మీకు నేను నడమురాఁ దగునా

(॥॥)
తెగని యాసతో మీరు తెరవేసుకుండఁగాను
సొగిసి నేనిటు తొంగి చూడవచ్చునా
పగటున మీలోన పచ్చిమాటలాడఁగాను
వెగటుగా నిట్టే పొంచు విన నాకు వచ్చునా

(॥॥)
కామించి మీరిద్దరును కాఁగిలించుకుండఁగాను
ఆముకొని నే వీడెమియ్యఁగ వచ్చునా
యీమేరనే శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
మీమీఁదంట బంతాలు మెరయఁగ వచ్చునా.

(||pallavi||)
ela dūrevayyā yĕḍagalaśhuṁṭi naṁṭā
volivĕṭṭi pĕṁḍlāḍam̐ga nŏrayam̐ga vachchunā

(||||)
iddarunu mīriṭṭe yegadamulāḍam̐gānu
vŏddigi rāvachchunā vūrage nenu
pĕddarigamulagunu pĕnagum̐lāḍāḍam̐gānu
adaliṁchi mīgu nenu naḍamurām̐ dagunā

(||||)
tĕgani yāsado mīru tĕravesuguṁḍam̐gānu
sŏgisi neniḍu tŏṁgi sūḍavachchunā
pagaḍuna mīlona pachchimāḍalāḍam̐gānu
vĕgaḍugā niṭṭe pŏṁchu vina nāgu vachchunā

(||||)
kāmiṁchi mīriddarunu kām̐giliṁchuguṁḍam̐gānu
āmugŏni ne vīḍĕmiyyam̐ga vachchunā
yīmerane śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
mīmīm̐daṁṭa baṁtālu mĕrayam̐ga vachchunā.