ఏల దూరేరే మీరు యింతులాల రమణుని
(॥పల్లవి॥)
ఏల దూరేరే మీరు యింతులాల రమణుని
వేల గాచుకుండితేను వేడుకే కదే
(॥ఏల॥)
నగకుండితే నేమాయ నాతితోడ వద్దనుండి
మగనిసేవ సేసితే మంచిదేకదే
జగడించితే నేమాయ సమ్మతించి వెనకను
మిగులా మేలమాడితే మేలేకదే
(॥ఏల॥)
మొక్కకుండితే నేమాయ ముందువెనకైనామ
మక్కువ మోము చూచితే మంచిదేకదే
కక్కసించితే నేమాయ కప్పురము చేతికిచ్చి
మిక్కిలి పెనఁగినాను మేలేకదే
(॥ఏల॥)
ఆడకుండితే నేమాయ అందరిగారిమాఁటలు
మాడలు రాలేజంకెలు మంచిదేకదే
యీడనే శ్రీవేంకటేశుఁ డింతలోనె యీపెఁగూడె
మేడెపురతికూటమి మేలేకదే
(||pallavi||)
ela dūrere mīru yiṁtulāla ramaṇuni
vela gāsuguṁḍidenu veḍuge kade
(||ela||)
nagaguṁḍide nemāya nādidoḍa vaddanuṁḍi
maganiseva seside maṁchidegade
jagaḍiṁchide nemāya sammadiṁchi vĕnaganu
migulā melamāḍide melegade
(||ela||)
mŏkkaguṁḍide nemāya muṁduvĕnagaināma
makkuva momu sūside maṁchidegade
kakkasiṁchide nemāya kappuramu sedigichchi
mikkili pĕnam̐ginānu melegade
(||ela||)
āḍaguṁḍide nemāya aṁdarigārimām̐ṭalu
māḍalu rālejaṁkĕlu maṁchidegade
yīḍane śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ yībĕm̐gūḍĕ
meḍĕburadigūḍami melegade