ఏల దూరీ నేల పోరీ నితఁడే తాను
(॥పల్లవి॥)
ఏల దూరీ నేల పోరీ నితఁడే తాను
వేళతో బుద్దిచెప్పఁగా విననైతినా
(॥॥)
అత్తి నే నలిగితిఁబో అప్పుడే రమణుఁడు
పోత్తుకు రమ్మనఁగా నేఁ బోనైతినా
మత్తుఁడై యాపొద్దుకట్టె మఱతెఁబో ఇప్పుడైనా
వత్తునని చెప్పెంపఁగా వద్దంటినా
(॥॥)
వుంటిఁబో నాచలముతో నోరుపుగలవాఁడై తే
నంటుగాఁ దా నవ్వఁగా నే నవ్వనైతినా
కంటకాన నొకతప్పు గలిగెఁబో ఇఁకనైనా
జంటన నన్నుఁ జెనకఁగా సమ్మతించకుంటినా
(॥॥)
తతితో సిగ్గున నే తలవంచుకుండితిఁబో
రతులఁ గరఁచఁ గరఁగఁగనైతినా
ఇతవై శ్రీ వేంకటేశుఁ డింతసేసి నన్నుఁ గూడె
కతగా, ఇదె తొల్లి కాదంటినా
(||pallavi||)
ela dūrī nela porī nidam̐ḍe tānu
veḽado buddisĕppam̐gā vinanaidinā
(||||)
atti ne naligidim̐bo appuḍe ramaṇum̐ḍu
pottugu rammanam̐gā nem̐ bonaidinā
mattum̐ḍai yābŏddugaṭṭĕ maṟadĕm̐bo ippuḍainā
vattunani sĕppĕṁpam̐gā vaddaṁṭinā
(||||)
vuṁṭim̐bo nāsalamudo norubugalavām̐ḍai te
naṁṭugām̐ dā navvam̐gā ne navvanaidinā
kaṁṭagāna nŏgadappu galigĕm̐bo im̐kanainā
jaṁṭana nannum̐ jĕnagam̐gā sammadiṁchaguṁṭinā
(||||)
tadido sigguna ne talavaṁchuguṁḍidim̐bo
radulam̐ garam̐sam̐ garam̐gam̐ganaidinā
idavai śhrī veṁkaḍeśhum̐ ḍiṁtasesi nannum̐ gūḍĕ
kadagā, idĕ tŏlli kādaṁṭinā