Ela dooree nela komkee nela volalu veseeni

ఏల దూరీ నేల కొంకీ నేల వోలలు వేసీని
Language

(॥పల్లవి॥)
ఏల దూరీ నేల కొంకీ నేల వోలలు వేసీని
చాలుఁ జాలదని నే జరసేనటే

(॥ఏల॥)
సిగ్గరితనముననే చేరి వుండేదానఁగాక
నిగ్గులఁ దనతో నేను నిష్టూరినటే
వొగ్గుచు మానాపతినై వోరుచుకుండుదుఁగాక
వెగ్గళించి తనతోను వేసరించేన టే

(॥ఏల॥)
ఇలువరుస యెంచుక యిచ్చలో మెలఁగేఁగాక
చలములు తనతోను సాదించేనటే
వెలలేని వినయీలు వేవేలు చెప్పదుఁగాక
పలుమారు నాడరానిపంత మాడుదునటే

(॥ఏల॥)
యిల్లాలితనముననే యెనసి వుండుదుఁగాక
మల్లాడి తనతో మారుమలతునటే
ఇల్లిదె శ్రీవేంకటేశఁ డిప్పడిట్టె నన్నుఁ గూడె
వొల్లనే యప్పటిఁ దను నొరసేనటే

(||pallavi||)
ela dūrī nela kŏṁkī nela volalu vesīni
sālum̐ jāladani ne jarasenaḍe

(||ela||)
siggaridanamunane seri vuṁḍedānam̐gāga
niggulam̐ danado nenu niṣhṭūrinaḍe
vŏggusu mānābadinai vorusuguṁḍudum̐gāga
vĕggaḽiṁchi tanadonu vesariṁchena ṭe

(||ela||)
iluvarusa yĕṁchuga yichchalo mĕlam̐gem̐gāga
salamulu tanadonu sādiṁchenaḍe
vĕlaleni vinayīlu vevelu sĕppadum̐gāga
palumāru nāḍarānibaṁta māḍudunaḍe

(||ela||)
yillālidanamunane yĕnasi vuṁḍudum̐gāga
mallāḍi tanado mārumaladunaḍe
illidĕ śhrīveṁkaḍeśham̐ ḍippaḍiṭṭĕ nannum̐ gūḍĕ
vŏllane yappaḍim̐ danu nŏrasenaḍe