ఏల దాఁచుకొనేవు నీవెరిఁగినదానవు
(॥పల్లవి॥)
ఏల దాఁచుకొనేవు నీవెరిఁగినదానవు
వేళ గాచుకొని వెల్లవిరి సేయరాదా
(॥॥)
నెలఁత నీమోముతేట నిండుమోవి తేనెలూట
పొలసి నీరమణుఁడు పొగడీనదే
చిలికి నీవేల యిఁక సిగ్గులు వడేవింత
పలుమారు నింకాఁ గొంత పచారించరాదా
(॥॥)
నెఱుల నీపెనుఁగొప్పు నిచ్చజవ్వనపుఁ జొప్పు
తఱి నీవిభుఁడు వ్రాసీ తమితోనదే
మఱఁగేల సేసేవు మర్మములుగా నింత
గుఱిగా నింకా నీవే కుప్పళించరాదా
(॥॥)
భావపు నీలోకరఁగు పయ్యద జారుఁజెరఁగు
శ్రీవేంకటేశుఁడు వెల సేసీనదే
మోవనాడి మాటలేల మూటలు గట్టేవింత
యీవిధానఁ గూడితివి యేర్పరచరాదా
(||pallavi||)
ela dām̐sugŏnevu nīvĕrim̐ginadānavu
veḽa gāsugŏni vĕllaviri seyarādā
(||||)
nĕlam̐ta nīmomudeḍa niṁḍumovi tenĕlūḍa
pŏlasi nīramaṇum̐ḍu pŏgaḍīnade
siligi nīvela yim̐ka siggulu vaḍeviṁta
palumāru niṁkām̐ gŏṁta pasāriṁcharādā
(||||)
nĕṟula nībĕnum̐gŏppu nichchajavvanabum̐ jŏppu
taṟi nīvibhum̐ḍu vrāsī tamidonade
maṟam̐gela sesevu marmamulugā niṁta
guṟigā niṁkā nīve kuppaḽiṁcharādā
(||||)
bhāvabu nīlogaram̐gu payyada jārum̐jĕram̐gu
śhrīveṁkaḍeśhum̐ḍu vĕla sesīnade
movanāḍi māḍalela mūḍalu gaṭṭeviṁta
yīvidhānam̐ gūḍidivi yerbarasarādā