Ela daamse vimtalone yimdarimumdaraa nemdu

ఏల దాఁచే వింతలోనే యిందరిముందరా నేఁడు
Language

(॥పల్లవి॥)
ఏల దాఁచే వింతలోనే యిందరిముందరా నేఁడు
చాల మెచ్చేఁగాని యా సతిఁ జూపరాదా

(॥ఏల॥)
చెంతల నేఁబిలిచితే చేరి వూరకున్నాఁడవు
పంతము దప్పీనా పలికితేను
యింతలో నేమస్తునిగా నెవ్వతె సేసెనో నిన్ను
సంతోసించేఁ గాని ఆసతిఁ జూపరాదా

(॥ఏల॥)
అంకెలఁ జెక్కు నొక్కితే నట్టే తల వంచేవు
సుంకము వచ్చీనా చూచితేను
పంకించకెవ్వతె నిన్ను బమ్మచారిఁ జేసెనో
సంకెదేరిచేఁ గాని ఆసతిఁ జూపరాదా

(॥ఏల॥)
తనువు చేతనంటితే దాఁగి నన్నుఁ గూడితివి
అనుపు నిన్నుఁ గొనేరా అట్టే వచ్చితే
యెనసి శ్రీ వేంకటేశ యెవ్వతె నీకు నేర్పెనో
చనవు చూచేఁగాని యాసతిఁ జూపరాదా

(||pallavi||)
ela dām̐se viṁtalone yiṁdarimuṁdarā nem̐ḍu
sāla mĕchchem̐gāni yā sadim̐ jūbarādā

(||ela||)
sĕṁtala nem̐biliside seri vūragunnām̐ḍavu
paṁtamu dappīnā paligidenu
yiṁtalo nemastunigā nĕvvadĕ sesĕno ninnu
saṁtosiṁchem̐ gāni āsadim̐ jūbarādā

(||ela||)
aṁkĕlam̐ jĕkku nŏkkide naṭṭe tala vaṁchevu
suṁkamu vachchīnā sūsidenu
paṁkiṁchagĕvvadĕ ninnu bammasārim̐ jesĕno
saṁkĕderisem̐ gāni āsadim̐ jūbarādā

(||ela||)
tanuvu sedanaṁṭide dām̐gi nannum̐ gūḍidivi
anubu ninnum̐ gŏnerā aṭṭe vachchide
yĕnasi śhrī veṁkaḍeśha yĕvvadĕ nīgu nerbĕno
sanavu sūsem̐gāni yāsadim̐ jūbarādā