ఏల బుద్ది చెప్పేరే యెన్నిమారులైనా నాకు
(॥పల్లవి॥)
ఏల బుద్ది చెప్పేరే యెన్నిమారులైనా నాకు
వేళతోడ వాని పొందు విడువఁగ లేనే
(॥ఏల॥)
తలపోసి తలపోసి తనలో గుబ్బతిల్లితే
వలపు చల్లారఁబెట్ట వసమౌనటే
యిల నెదురుచూపుల నేచిన కాంక్షలు
కెలసి నీళఁ గడిగిన మానునటవే
(॥ఏల॥)
తడఁబాటు తమకము తనువునఁ బెరిగితే
వడి విరహము దాఁచ వసమౌనటే
బడివాయకుండఁగాను పరగిన ననుపులు
తొడికిపట్టి చీరఁ దుడువవచ్చునటే
(॥ఏల॥)
సంతతము కౌఁగిటిలో సారెఁ బెనఁగులాడితే
వంతులకు సిగ్గు దాఁచ వసమౌనటే
యింతలో శ్రీవేంకటేశుఁ డెన్నికగా నన్నుఁ గూడె
పంతములు పిడికిటఁ బట్టి వచ్చునటవే
(||pallavi||)
ela buddi sĕppere yĕnnimārulainā nāgu
veḽadoḍa vāni pŏṁdu viḍuvam̐ga lene
(||ela||)
talabosi talabosi tanalo gubbadillide
valabu sallāram̐bĕṭṭa vasamaunaḍe
yila nĕdurusūbula nesina kāṁkṣhalu
kĕlasi nīḽam̐ gaḍigina mānunaḍave
(||ela||)
taḍam̐bāḍu tamagamu tanuvunam̐ bĕrigide
vaḍi virahamu dām̐sa vasamaunaḍe
baḍivāyaguṁḍam̐gānu paragina nanubulu
tŏḍigibaṭṭi sīram̐ duḍuvavachchunaḍe
(||ela||)
saṁtadamu kaum̐giḍilo sārĕm̐ bĕnam̐gulāḍide
vaṁtulagu siggu dām̐sa vasamaunaḍe
yiṁtalo śhrīveṁkaḍeśhum̐ ḍĕnnigagā nannum̐ gūḍĕ
paṁtamulu piḍigiḍam̐ baṭṭi vachchunaḍave