Ela buddhulu seppere yemdaamkaa nidanigi

ఏల బుద్ధులు చెప్పేరె యెందాఁకా నితనికి
Language

(॥పల్లవి॥)
ఏల బుద్ధులు చెప్పేరె యెందాఁకా నితనికి
తాలిమి గలితే నేమె తగ వెరిఁగేము

(॥ఏల॥)
తలఁ పొకచో నుండఁగ తనపైకి దీసుకొని
బలిమి నేయఁగఁ బోతే పచ్చి దోఁచును
పెలుచుఁ జిత్త మాతనిఁ బెనఁగి యేమి సేసినా
చలములు రేఁగుఁ గాని చవి చాలదు

(॥ఏల॥)
అవ్వల మాటలాడఁగ నందుకెతా మాటాడితె
పువ్వక పూచినట్టు పుల్లఁబారును
రవ్వగా నాతని నెంత రతలకుఁ దీసినాను
నవ్వుఁ బాటై యిందరిలో నారటిలునూ

(॥ఏల॥)
యెందొ యెదురు చూడఁగా నెదిటికిఁ బోతేను
సందడి యనుచు మతి సమ్మతించదు
చెంది యింత చెప్పఁగాను శ్రీవెంకటేశుఁడు గూడె
మందలించి యివి యల్లా మచ్చికల కెక్కును

(||pallavi||)
ela buddhulu sĕpperĕ yĕṁdām̐kā nidanigi
tālimi galide nemĕ taga vĕrim̐gemu

(||ela||)
talam̐ pŏgaso nuṁḍam̐ga tanabaigi dīsugŏni
balimi neyam̐gam̐ bode pachchi dom̐sunu
pĕlusum̐ jitta mādanim̐ bĕnam̐gi yemi sesinā
salamulu rem̐gum̐ gāni savi sāladu

(||ela||)
avvala māḍalāḍam̐ga naṁdugĕdā māḍāḍidĕ
puvvaga pūsinaṭṭu pullam̐bārunu
ravvagā nādani nĕṁta radalagum̐ dīsinānu
navvum̐ bāḍai yiṁdarilo nāraḍilunū

(||ela||)
yĕṁdŏ yĕduru sūḍam̐gā nĕdiḍigim̐ bodenu
saṁdaḍi yanusu madi sammadiṁchadu
sĕṁdi yiṁta sĕppam̐gānu śhrīvĕṁkaḍeśhum̐ḍu gūḍĕ
maṁdaliṁchi yivi yallā machchigala kĕkkunu