Ela boodagamu sese vimtalonanu

ఏల బూటకము సేసే వింతలోనను
Language

(॥పల్లవి॥)
ఏల బూటకము సేసే వింతలోనను
పోలికలన్నియును నీపొరుగున నున్నవి

(॥ఏల॥)
బత్తిసేయ నెఱఁగను పంతమాడ నెఱఁగను
చిత్తమువచ్చినదాఁకా సేవ చేసేను
హత్తి కాఁగిలించుమంటా నానలేల పెట్టేవు
వత్తివలె నీమోవి వాడుదేరీ నిపుడు

(॥ఏల॥)
తలఁపు దెలియనోప తమకించి దూరనోప
వలెనన్నప్పటిదాఁకా వద్ద నుండేను
మొలకనవ్వులతోడ మొగమేమి చూచేవు
కలిగినయలపెల్లా కాయముపై నున్నది

(॥ఏల॥)
కనుసన్న సేయఁజాల కమ్మటిఁ గొసరఁజాల
తనిసిన యందాఁకా తమిరేఁచేను
ఘనుఁడ శ్రీవేంకటేశ కరగించి కూడితివి
వెనకటిరతులెల్లా వెరగులై మించెను

(||pallavi||)
ela būḍagamu sese viṁtalonanu
poligalanniyunu nībŏruguna nunnavi

(||ela||)
battiseya nĕṟam̐ganu paṁtamāḍa nĕṟam̐ganu
sittamuvachchinadām̐kā seva sesenu
hatti kām̐giliṁchumaṁṭā nānalela pĕṭṭevu
vattivalĕ nīmovi vāḍuderī nibuḍu

(||ela||)
talam̐pu dĕliyanoba tamagiṁchi dūranoba
valĕnannappaḍidām̐kā vadda nuṁḍenu
mŏlaganavvuladoḍa mŏgamemi sūsevu
kaliginayalabĕllā kāyamubai nunnadi

(||ela||)
kanusanna seyam̐jāla kammaḍim̐ gŏsaram̐jāla
tanisina yaṁdām̐kā tamirem̐senu
ghanum̐ḍa śhrīveṁkaḍeśha karagiṁchi kūḍidivi
vĕnagaḍiradulĕllā vĕragulai miṁchĕnu