ఏల భేదాలు సేసేవు యేమి గట్టుకొంటివి
(॥పల్లవి॥)
ఏల భేదాలు సేసేవు యేమి గట్టుకొంటివి
రేలునుఁ బగళ్లు యిద్దరికిఁ బొత్తు గాదా
(॥ఏల॥)
వావియల్లా నొకటే వరుస లెంచిచూచితే
నీవు మేనభావపు నే మఱఁదల
యీవల వలపునూ ఇద్దరి కొక్కటే నీవు
ఆవటించి మొగవాఁడ వాఁటదాన నేను
(॥ఏల॥)
మనసెల్లా నొక్కటే మదనకేలిలోన
వినయము నాది రతివెరగు నీది
ననుపెల్లా నొక్కటే నగవులలోపలి-
చెనకులు నీచేతివి సిగ్గులు నామేనివి
(॥ఏల॥)
కాఁగిలియు నొక్కటే కమ్మినభోగములోన
పాఁగినది నీమోవి ఆపసలు నావి
వీగక యిద్దరము శ్రీవేంకటేశ కూడితిమి
రాఁగినతమకములరచన లిదరివి
(||pallavi||)
ela bhedālu sesevu yemi gaṭṭugŏṁṭivi
relunum̐ bagaḽlu yiddarigim̐ bŏttu gādā
(||ela||)
vāviyallā nŏgaḍe varusa lĕṁchisūside
nīvu menabhāvabu ne maṟam̐dala
yīvala valabunū iddari kŏkkaḍe nīvu
āvaḍiṁchi mŏgavām̐ḍa vām̐ṭadāna nenu
(||ela||)
manasĕllā nŏkkaḍe madanagelilona
vinayamu nādi radivĕragu nīdi
nanubĕllā nŏkkaḍe nagavulalobali-
sĕnagulu nīsedivi siggulu nāmenivi
(||ela||)
kām̐giliyu nŏkkaḍe kamminabhogamulona
pām̐ginadi nīmovi ābasalu nāvi
vīgaga yiddaramu śhrīveṁkaḍeśha kūḍidimi
rām̐ginadamagamularasana lidarivi