Ela balimi sesevu imtalo mammu

ఏల బలిమి సేసేవు ఇంతలో మమ్ము
Language

(॥పల్లవి॥)
ఏల బలిమి సేసేవు ఇంతలో మమ్ము
వాలుక రెప్పల తలవంచుటే సుకము

(॥ఏల॥)
మాయదారి వారి తోడ మంతనాలాడుట కంటె
చాయలు సేసుకుండుటే జాణతనము
చేయి మీఁదఇనవారిఁ జెనకుటకంటేను
ఆయమెరిఁగి నవ్వుటే అది మంచితనము

(॥ఏల॥)
యేతులు నెరపేవారి యెదుట నిలుచుకంటే
దూత పనులు సేయుటే దొరతనము
కాతరించేవారితోడ కతలు చెప్పుటకంటే
నీతితో మోనానుండే నేరుపే నేరుపు

(॥ఏల॥)
వేసాల నెరపేవారి వేడుక చూచుటకంటే
వాసితో జూజ మాడితే వై పైవుండు
ఆసల శ్రీ వేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
నీసొబగు యిట్లానుంటే నిచ్చకల్యాణములు

(||pallavi||)
ela balimi sesevu iṁtalo mammu
vāluga rĕppala talavaṁchuḍe sugamu

(||ela||)
māyadāri vāri toḍa maṁtanālāḍuḍa kaṁṭĕ
sāyalu sesuguṁḍuḍe jāṇadanamu
seyi mīm̐da̮inavārim̐ jĕnaguḍagaṁṭenu
āyamĕrim̐gi navvuḍe adi maṁchidanamu

(||ela||)
yedulu nĕrabevāri yĕduḍa nilusugaṁṭe
dūda panulu seyuḍe dŏradanamu
kādariṁchevāridoḍa kadalu sĕppuḍagaṁṭe
nīdido monānuṁḍe nerube nerubu

(||ela||)
vesāla nĕrabevāri veḍuga sūsuḍagaṁṭe
vāsido jūja māḍide vai paivuṁḍu
āsala śhrī veṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
nīsŏbagu yiṭlānuṁṭe nichchagalyāṇamulu