Ela baasalu sesevu ippudu naado

ఏల బాసలు చేసేవు ఇప్పుడు నాతో
Language

(॥పల్లవి॥)
ఏల బాసలు చేసేవు ఇప్పుడు నాతో
లాలించేటి యీ జవ్వనులను మీఱఁగలవా

(॥ఏల॥)
పంతపుమాటలు నీతోఁ బలుమారు నాడియాడి
కాంతలిందరు మదనకళ రేఁచేరు
యెంతటివాఁడవైనా నెప్పుడూ నీవొక్కఁడవే
కాంతుఁడ వారికి లోను గాకుండఁ గలవా

(॥ఏల॥)
ననుపు చేసుక నీతో నయముగ నవ్వినవ్వి
వనితలు వలపులు వడివెట్టేరు
ఘనుఁడవైనాఁ గాని కలవాఁడవు నీవే
మనసిచ్చి వీరితోడ మారాడఁ గలవా

(॥ఏల॥)
చెంగలించి కాఁగిలించి సేవలెల్లాఁ నీకుఁ జేసి
అంగనలు రతులను ఆసచూపేరు
చెంగట నన్నేలితివి శ్రీవేంకటేశుఁడవైన
సంగడి నందరితోడ సాము సేయఁగలవా

(||pallavi||)
ela bāsalu sesevu ippuḍu nādo
lāliṁcheḍi yī javvanulanu mīṟam̐galavā

(||ela||)
paṁtabumāḍalu nīdom̐ balumāru nāḍiyāḍi
kāṁtaliṁdaru madanagaḽa rem̐seru
yĕṁtaḍivām̐ḍavainā nĕppuḍū nīvŏkkam̐ḍave
kāṁtum̐ḍa vārigi lonu gāguṁḍam̐ galavā

(||ela||)
nanubu sesuga nīdo nayamuga navvinavvi
vanidalu valabulu vaḍivĕṭṭeru
ghanum̐ḍavainām̐ gāni kalavām̐ḍavu nīve
manasichchi vīridoḍa mārāḍam̐ galavā

(||ela||)
sĕṁgaliṁchi kām̐giliṁchi sevalĕllām̐ nīgum̐ jesi
aṁganalu radulanu āsasūberu
sĕṁgaḍa nannelidivi śhrīveṁkaḍeśhum̐ḍavaina
saṁgaḍi naṁdaridoḍa sāmu seyam̐galavā