ఎక్కువైన దొర దాను యిల్లాల నేను
(॥పల్లవి॥)
ఎక్కువైన దొర దాను యిల్లాల నేను
వొక్కటి గమ్మనీఁ దాను వోయమ్మ వెరతునే
(॥ఎక్కు॥)
మొక్కితి నేఁ జేతులెత్తి మోనాన నుండితిని
చిక్కుదేరె నింక నేమి సేయుమనీనే
పక్కన నవ్వితి నే నప్పటిఁ దలవంచుకొంటి
యొక్కవతక్కువ లింక నిందులోన నేలే
(॥ఎక్కు॥)
దగ్గరి విడెమిచ్చితి దవ్వులనే నిలుచుంటి
సిగ్గువిడిచింక నేమి సేయుమనీనే
నిగ్గుల నిక్కి చూచితి నే నింటిలోని కేఁగితి
వెగ్గల మింతకు నెరవేసా లేలే
(॥ఎక్కు॥)
పాదము లొత్తితిని పానుపుపైఁ బండితిని
సేదదేరె నిఁక నేమి సేయుమనీనే
ఆదరించి శ్రీ వేంకటేశుఁ డిటు గూడె
వాదులెల్లఁ దీరె నిఁక వంతువాసు లేలే
(||pallavi||)
ĕkkuvaina dŏra dānu yillāla nenu
vŏkkaḍi gammanīm̐ dānu voyamma vĕradune
(||ĕkku||)
mŏkkidi nem̐ jedulĕtti monāna nuṁḍidini
sikkuderĕ niṁka nemi seyumanīne
pakkana navvidi ne nappaḍim̐ dalavaṁchugŏṁṭi
yŏkkavadakkuva liṁka niṁdulona nele
(||ĕkku||)
daggari viḍĕmichchidi davvulane nilusuṁṭi
sigguviḍisiṁka nemi seyumanīne
niggula nikki sūsidi ne niṁṭiloni kem̐gidi
vĕggala miṁtagu nĕravesā lele
(||ĕkku||)
pādamu lŏttidini pānububaim̐ baṁḍidini
sedaderĕ nim̐ka nemi seyumanīne
ādariṁchi śhrī veṁkaḍeśhum̐ ḍiḍu gūḍĕ
vādulĕllam̐ dīrĕ nim̐ka vaṁtuvāsu lele