Ekkuvaide mogasaamtau nemdaru gaavalenayya

ఎక్కువైతే మొగచాఁటౌ నెందరు గావలెనయ్య
Language

(॥పల్లవి॥)
ఎక్కువైతే మొగచాఁటౌ నెందరు గావలెనయ్య
చిక్కని చన్నులమీఁదఁ జేయి చాఁచేవిపుడు

(॥ఎక్కు॥)
వెల వెట్టి కొనవద్దు వేడుకైన వలపు
కలగూరగంపవలెఁ గాచుకున్నది
చెలులు మందపట్ల చెట్టడిచితేఁ జేటఁడు
కలిగుండఁగా మామీదాఁ గాలుచాఁచేవిపుడు

(॥ఎక్కు॥)
పంట పండి తేవద్దు పాయని చుట్టరికము
పెంటలవలె నంతటాఁ బెరిగున్నది
గొంటరిసతుఁ పొందు కొండ్రఁ గొండ్ర వేయేసి
అంటేవు మాకుచములు అప్పటి నీవిపుడు

(॥ఎక్కు॥)
కరఁగించి సేయవద్దు కాఁగిటలోనిరతి
వొరసిన సొమ్మువలె వొళ్లనున్నది
తరుణుల సరసాలు మెరచినంతే మెరుఁగును
ఇరవై శ్రీవేంకటేశ యేలితి నన్నిపుడు

(||pallavi||)
ĕkkuvaide mŏgasām̐ṭau nĕṁdaru gāvalĕnayya
sikkani sannulamīm̐dam̐ jeyi sām̐sevibuḍu

(||ĕkku||)
vĕla vĕṭṭi kŏnavaddu veḍugaina valabu
kalagūragaṁpavalĕm̐ gāsugunnadi
sĕlulu maṁdabaṭla sĕṭṭaḍisidem̐ jeḍam̐ḍu
kaliguṁḍam̐gā māmīdām̐ gālusām̐sevibuḍu

(||ĕkku||)
paṁṭa paṁḍi tevaddu pāyani suṭṭarigamu
pĕṁṭalavalĕ naṁtaḍām̐ bĕrigunnadi
gŏṁṭarisadum̐ pŏṁdu kŏṁḍram̐ gŏṁḍra veyesi
aṁṭevu māgusamulu appaḍi nīvibuḍu

(||ĕkku||)
karam̐giṁchi seyavaddu kām̐giḍaloniradi
vŏrasina sŏmmuvalĕ vŏḽlanunnadi
taruṇula sarasālu mĕrasinaṁte mĕrum̐gunu
iravai śhrīveṁkaḍeśha yelidi nannibuḍu