Ekkuvadakkuva maada limkanela

ఎక్కువతక్కువ మాట లిఁకనేల
Language

(॥పల్లవి॥)
ఎక్కువతక్కువ మాట లిఁకనేల
మిక్కిలి నీలోఁ గలమేలు చూపవలెఁ బో

(॥ఎక్కు॥)
పంతమాడినట్లానే పనికి రావలెఁగాని
యెఁతైననేతులు నెమ్మె లెవ్వ రాడరు
మంతనాన నున్నారము మచ్చిక నిద్దరమును
చెంతన నీచేతఁలెల్లాఁ జేసి చూపవలెఁబో

(॥ఎక్కు॥)
నన్ను నవ్వినట్లానే ననుపు గావలెఁగాని
ఇన్నేసి వేసాలబీరా లెంతలేదు
కన్నుల యెదుట నిదె కానవచ్చీ మనగుట్టు
పన్నినరతిమర్మాలు పచరించవలెఁబో

(॥ఎక్కు॥)
కొంగువట్టినట్లానే కూడిచూపవలెఁగాని
యెంగిలివట్టి సరసా లేమిబాఁతి
చెంగటఁ గూడితిమిదె శ్రీవేంకటేశ మనము
పొంగేటి యాసోదాల భోగించవలెఁబో

(||pallavi||)
ĕkkuvadakkuva māḍa lim̐kanela
mikkili nīlom̐ galamelu sūbavalĕm̐ bo

(||ĕkku||)
paṁtamāḍinaṭlāne panigi rāvalĕm̐gāni
yĕm̐tainanedulu nĕmmĕ lĕvva rāḍaru
maṁtanāna nunnāramu machchiga niddaramunu
sĕṁtana nīsedam̐lĕllām̐ jesi sūbavalĕm̐bo

(||ĕkku||)
nannu navvinaṭlāne nanubu gāvalĕm̐gāni
innesi vesālabīrā lĕṁtaledu
kannula yĕduḍa nidĕ kānavachchī managuṭṭu
panninaradimarmālu pasariṁchavalĕm̐bo

(||ĕkku||)
kŏṁguvaṭṭinaṭlāne kūḍisūbavalĕm̐gāni
yĕṁgilivaṭṭi sarasā lemibām̐ti
sĕṁgaḍam̐ gūḍidimidĕ śhrīveṁkaḍeśha manamu
pŏṁgeḍi yāsodāla bhogiṁchavalĕm̐bo