Ekkuva takkuva levi yimdarilobala nenu

ఎక్కువ తక్కువ లేవి యిందరిలోపల నేను
Language

(॥పల్లవి॥)
ఎక్కువ తక్కువ లేవి యిందరిలోపల నేను
చిక్కి హరి నీవు పెద్ద సేసితివి గాక

(॥ఎక్కువ॥)
తెలియ నిందరివంటి దేహమే యిది గాదా
పొలసి దొరతనము పొదిగీఁ గాక
మలమూత్రములు రక్తమాంసము లొక్కటె కావా
కలిమి లేములు ముందు కాననియ్యవు గాక

(॥ఎక్కువ॥)
చేపట్టి యిందరివంటి జీవుఁడ నేఁ గానా
పాపపుణ్యములు నన్ను బరచీఁ గాక
యేపొద్దు లోకములోని యింద్రియము లివే కావా
తీపులు మరపి నన్ను దిమ్మరేఁచీఁ గాక

(॥ఎక్కువ॥)
కైకొని యిందరివంటి కర్మమే సేయఁగఁ గాదా
యీకడ సంపదలు నన్నేఁ బంచీఁ గాక
పైకొని శ్రీవేంకటేశ భక్తి యొక్కటె కాదా
యేకడనైనా నన్ను యీడేర్చుఁ గాకా

(||pallavi||)
ĕkkuva takkuva levi yiṁdarilobala nenu
sikki hari nīvu pĕdda sesidivi gāga

(||ĕkkuva||)
tĕliya niṁdarivaṁṭi dehame yidi gādā
pŏlasi dŏradanamu pŏdigīm̐ gāga
malamūtramulu raktamāṁsamu lŏkkaḍĕ kāvā
kalimi lemulu muṁdu kānaniyyavu gāga

(||ĕkkuva||)
sebaṭṭi yiṁdarivaṁṭi jīvum̐ḍa nem̐ gānā
pābabuṇyamulu nannu barasīm̐ gāga
yebŏddu logamuloni yiṁdriyamu live kāvā
tībulu marabi nannu dimmarem̐sīm̐ gāga

(||ĕkkuva||)
kaigŏni yiṁdarivaṁṭi karmame seyam̐gam̐ gādā
yīgaḍa saṁpadalu nannem̐ baṁchīm̐ gāga
paigŏni śhrīveṁkaḍeśha bhakti yŏkkaḍĕ kādā
yegaḍanainā nannu yīḍersum̐ gāgā