(॥పల్లవి॥)
ఎక్కువ తక్కువ లెఱఁగ మిదే
మొక్కఁగ నేరుతు మునుకొని నీకు
(॥ఎక్కు॥)
కలిగినమాటకుఁ గాదనరాదు
తొలఁగక చెలితో దూరితిని
తొలుతటివిధ మది తూరీ నన్నిపుడు
మెలుపునఁ గూడఁగ మెచ్చితి నిన్ను
(॥ఎక్కు॥)
చేసిన చేఁతలు చెప్పకపోదు
వేసితి నీపై వెసఁ దమ్మీ
వాసి అప్పటిది వరుస నీ విపుడు
సేసలు వెట్టఁగఁ జేకొంటి నిన్ను
(॥ఎక్కు॥)
కూడిన కూటమి కొద మరిలేదు
వోడక కాఁగిట నొత్తితిని
వేడుక లావేళ విభవము లీవేళ
యీడనే శ్రీవేంకటేశ పొగడితి
(||pallavi||)
ĕkkuva takkuva lĕṟam̐ga mide
mŏkkam̐ga nerudu munugŏni nīgu
(||ĕkku||)
kaliginamāḍagum̐ gādanarādu
tŏlam̐gaga sĕlido dūridini
tŏludaḍividha madi tūrī nannibuḍu
mĕlubunam̐ gūḍam̐ga mĕchchidi ninnu
(||ĕkku||)
sesina sem̐talu sĕppagabodu
vesidi nībai vĕsam̐ dammī
vāsi appaḍidi varusa nī vibuḍu
sesalu vĕṭṭam̐gam̐ jegŏṁṭi ninnu
(||ĕkku||)
kūḍina kūḍami kŏda mariledu
voḍaga kām̐giḍa nŏttidini
veḍuga lāveḽa vibhavamu līveḽa
yīḍane śhrīveṁkaḍeśha pŏgaḍidi