ఎక్కుడు గొసరఁబోతే యే పనికి వచ్చునయ్య
(॥పల్లవి॥)
ఎక్కుడు గొసరఁబోతే యే పనికి వచ్చునయ్య
మక్కువ గలిగినంత మన్నించవయ్యా
(॥ఎక్కు॥)
పంతముకొలఁదులె పలుకులెల్లా
మంతనము కొలఁదివే మనవులును
బంతి వడ్డించేకొలఁదే పరఁగవిందు
చెంతఁ జేరినకొలఁదే చేకొన్న చనవులు
(॥ఎక్కు॥)
ననుపుకొలఁదివే నగవులును
చనవుకొలఁదివే సరసములు
పెనఁగినకొలఁదివే ప్రియములును
వినయము కొలఁదివే వెసఁ జుట్టరికాలు
(॥ఎక్కు॥)
కూడినకొలఁదివే కూటములు
వాడికకొలఁదివే వలపులును
యీడనే శ్రీవేంకటేశ యే నలమేలు మంగను
వేడుక నేలితివి వావి కొలఁదే వర్తన
(||pallavi||)
ĕkkuḍu gŏsaram̐bode ye panigi vachchunayya
makkuva galiginaṁta manniṁchavayyā
(||ĕkku||)
paṁtamugŏlam̐dulĕ palugulĕllā
maṁtanamu kŏlam̐dive manavulunu
baṁti vaḍḍiṁchegŏlam̐de param̐gaviṁdu
sĕṁtam̐ jerinagŏlam̐de segŏnna sanavulu
(||ĕkku||)
nanubugŏlam̐dive nagavulunu
sanavugŏlam̐dive sarasamulu
pĕnam̐ginagŏlam̐dive priyamulunu
vinayamu kŏlam̐dive vĕsam̐ juṭṭarigālu
(||ĕkku||)
kūḍinagŏlam̐dive kūḍamulu
vāḍigagŏlam̐dive valabulunu
yīḍane śhrīveṁkaḍeśha ye nalamelu maṁganu
veḍuga nelidivi vāvi kŏlam̐de vardana