ఎక్కుడేమి సేసినాను యెట్టువచ్చునో పనులు
(॥పల్లవి॥)
ఎక్కుడేమి సేసినాను యెట్టువచ్చునో పనులు
చక్కని సతులతోడ సంతము గావయ్యా
(॥ఎక్కు॥)
చెందిననీసతులలో చిగురుఁగొమ్మా చేఁగే
యెందరితో సాముసేసే వేమయ్యా
అందరును సరసములాడినట్టే నీవాడి
సందడి గుట్టుసేసుక చక్కనుండవయ్యా
(॥ఎక్కు॥)
కొమ్మలమోపులలోన కొనమొదలును తీసే
యెమ్మెలకుగరిసించే వేమయ్యా
యెమ్ముల నిచ్చకముల కిచ్చకములే సేసి
సమ్మతి నడిగినట్టె చనవియ్యవయ్యా
(॥ఎక్కు॥)
యాడనున్న సతులము ఇందరు నీకొక్కవారే
యేడ గొలఁది గూడితి వేమయ్యా
జోడై యలమేల్మంగనుఁ జూచినట్టే కృపఁ జూచి
వోడక శ్రీవేంకటేశ వొద్దనుండవయ్యా
(||pallavi||)
ĕkkuḍemi sesinānu yĕṭṭuvachchuno panulu
sakkani saduladoḍa saṁtamu gāvayyā
(||ĕkku||)
sĕṁdinanīsadulalo sigurum̐gŏmmā sem̐ge
yĕṁdarido sāmusese vemayyā
aṁdarunu sarasamulāḍinaṭṭe nīvāḍi
saṁdaḍi guṭṭusesuga sakkanuṁḍavayyā
(||ĕkku||)
kŏmmalamobulalona kŏnamŏdalunu tīse
yĕmmĕlagugarisiṁche vemayyā
yĕmmula nichchagamula kichchagamule sesi
sammadi naḍiginaṭṭĕ sanaviyyavayyā
(||ĕkku||)
yāḍanunna sadulamu iṁdaru nīgŏkkavāre
yeḍa gŏlam̐di gūḍidi vemayyā
joḍai yalamelmaṁganum̐ jūsinaṭṭe kṛpam̐ jūsi
voḍaga śhrīveṁkaḍeśha vŏddanuṁḍavayyā