Ekkinavaanigim jooda yenuga gujjai yumdu

ఎక్కినవానికిఁ జూడ యేనుగ గుజ్జై యుండు
Language

(॥పల్లవి॥)
ఎక్కినవానికిఁ జూడ యేనుగ గుజ్జై యుండు
వెక్కసమై వెలువ వేవేలు సేసునయ్యా

(॥ఎక్కిన॥)
నన్ను నాడుకోఁ గాని నాయంతటిది లేదు
వున్నత మయిన నీవూడిగానకు
పిన్నదాని కింత నీవు పెద్దరికము గట్టితి
విన్ని నీ పెద్దరికమే యెంచి చూడవయ్యా

(॥ఎక్కిన॥)
వెల్లవిరి సేయఁ గాని వెలితి లేదు నాకు
వెల్లనె రతుల నిన్ను మెప్పించేయందుకు
చెల్లబడి సేసితివి జిగి నీ యాఁటదానిని
కల్ల గా దివెల్లను నీ ఘనతే కాదా

(॥ఎక్కిన॥)
ఆన వెట్టుకోఁ గాని అన్నిటా జాణను నేను
మెనాన నీపాదాలు మెక్కేయందుకు
పూని శ్రీవెంకటేశుఁడ భోగించితి విటు నన్ను
యీ నగవు లీ సంతోస మిది నీదె సుమ్మీ

(||pallavi||)
ĕkkinavānigim̐ jūḍa yenuga gujjai yuṁḍu
vĕkkasamai vĕluva vevelu sesunayyā

(||ĕkkina||)
nannu nāḍugom̐ gāni nāyaṁtaḍidi ledu
vunnada mayina nīvūḍigānagu
pinnadāni kiṁta nīvu pĕddarigamu gaṭṭidi
vinni nī pĕddarigame yĕṁchi sūḍavayyā

(||ĕkkina||)
vĕllaviri seyam̐ gāni vĕlidi ledu nāgu
vĕllanĕ radula ninnu mĕppiṁcheyaṁdugu
sĕllabaḍi sesidivi jigi nī yām̐ṭadānini
kalla gā divĕllanu nī ghanade kādā

(||ĕkkina||)
āna vĕṭṭugom̐ gāni anniḍā jāṇanu nenu
mĕnāna nībādālu mĕkkeyaṁdugu
pūni śhrīvĕṁkaḍeśhum̐ḍa bhogiṁchidi viḍu nannu
yī nagavu lī saṁtosa midi nīdĕ summī