ఎక్కినవానికిఁ జూడ యేనిగె గుజ్జనుమాట
(॥పల్లవి॥)
ఎక్కినవానికిఁ జూడ యేనిగె గుజ్జనుమాట
నిక్కముగా భువిలోన నీవల్ల గంటిమి
(॥ఎక్కి॥)
మొగము చూడఁగానే మూటమాటలాడేవు
తగునా ఆతనితోడ దంటతనము
నగేవానితోడ నీవు నంటుసేసి గొణగేవు
అగపడితేఁ బతి అలసతే నీకు
(॥ఎక్కి॥)
దగ్గరి రాఁగానే నీవు తలవంచుకొనియేవు
యెగ్గా ఆతఁడు నీకు యేమైనాను
వొగ్గి చేయిచాఁచేవాని నొడ్డుకొంటా బెనఁగేవు
వెగ్గళించకుండితేనే వింతవాఁడా ఇతఁడు
(॥ఎక్కి॥)
కొంగువట్టి తియ్యఁగానే గొబ్బున సిగ్గువడేవు
సంగతా ఇద్దరి మీసరసవేళ
యింగితాన శ్రీ వేంకటేశుఁడిట్టె నిన్నుఁగూడె
ముంగిట నిలుచుంటేనే ముచ్చటలు చెల్లెనా
(||pallavi||)
ĕkkinavānigim̐ jūḍa yenigĕ gujjanumāḍa
nikkamugā bhuvilona nīvalla gaṁṭimi
(||ĕkki||)
mŏgamu sūḍam̐gāne mūḍamāḍalāḍevu
tagunā ādanidoḍa daṁṭadanamu
nagevānidoḍa nīvu naṁṭusesi gŏṇagevu
agabaḍidem̐ badi alasade nīgu
(||ĕkki||)
daggari rām̐gāne nīvu talavaṁchugŏniyevu
yĕggā ādam̐ḍu nīgu yemainānu
vŏggi seyisām̐sevāni nŏḍḍugŏṁṭā bĕnam̐gevu
vĕggaḽiṁchaguṁḍidene viṁtavām̐ḍā idam̐ḍu
(||ĕkki||)
kŏṁguvaṭṭi tiyyam̐gāne gŏbbuna sigguvaḍevu
saṁgadā iddari mīsarasaveḽa
yiṁgidāna śhrī veṁkaḍeśhum̐ḍiṭṭĕ ninnum̐gūḍĕ
muṁgiḍa nilusuṁṭene muchchaḍalu sĕllĕnā