ఎక్కినంతలోననే యేనిగ గుజ్జా
(॥పల్లవి॥)
ఎక్కినంతలోననే యేనిగ గుజ్జా
అక్కరై మాయింటికి రాకాతఁ డట్టె వుండీనా
(॥ఎక్కి॥)
ఆతనిచనవు వట్టు కట్టె విఱ్ఱవీఁగేవు
యేతులకు వాఁడికత్తులేల మింగేవే
కాతరాన నీకింత కపటాలు నెరపితే
ఆతల నీకేకాక అండవారి కేమే
(॥ఎక్కి॥)
రమణుఁడు నవ్వెనంటా రవ్వశాయ వచ్చేవు
తిమిరి యిసుక మీఁదై తిరుగకువే
భ్రమసి నీకాతఁడు బాస లెంత ఇచ్చినాను
అమర బతుకవే నే మాండ్లము గామా
(॥ఎక్కి॥)
శ్రీవేంకటేశుఁడు నిన్నుఁ జెందెనని మెరసేవు
దోవఁ బెసరు విత్తితే తుదకెక్కీనా
కావరిం చాతనిమేను కాఁగిటఁ జిక్కితే
యీవల మారతిఁ దొల్లి టెంగిలేకదే
(||pallavi||)
ĕkkinaṁtalonane yeniga gujjā
akkarai māyiṁṭigi rāgādam̐ ḍaṭṭĕ vuṁḍīnā
(||ĕkki||)
ādanisanavu vaṭṭu kaṭṭĕ viṭravīm̐gevu
yedulagu vām̐ḍigattulela miṁgeve
kādarāna nīgiṁta kabaḍālu nĕrabide
ādala nīgegāga aṁḍavāri keme
(||ĕkki||)
ramaṇum̐ḍu navvĕnaṁṭā ravvaśhāya vachchevu
timiri yisuga mīm̐dai tirugaguve
bhramasi nīgādam̐ḍu bāsa lĕṁta ichchinānu
amara badugave ne māṁḍlamu gāmā
(||ĕkki||)
śhrīveṁkaḍeśhum̐ḍu ninnum̐ jĕṁdĕnani mĕrasevu
dovam̐ bĕsaru vittide tudagĕkkīnā
kāvariṁ sādanimenu kām̐giḍam̐ jikkide
yīvala māradim̐ dŏlli ṭĕṁgilegade