ఎక్కడో సవతిమాఁట కింత చింత నీకేల
(॥పల్లవి॥)
ఎక్కడో సవతిమాఁట కింత చింత నీకేల
చెక్కు నొక్కి రమణుఁడు సేద దేర్చఁగాను
(॥ఎక్క॥)
గుట్టుతోఁ బతి నేపొద్దుఁ గూడివుండేయట్టినీకు
పట్టినచలము లేలే పడఁతి
జట్టిగొని యాతనితో సరసమాడేనీకు
వట్టిమోనమున నేల వాసే విదియేమే
(॥ఎక్క॥)
మొలకనవ్వులతోడ మోము చూచేయట్టినీకు
తలవంచుకొన నేలే తరుణి
చలిగుబ్బల నతని సారె నద్దుకొనేనీకు
నిలువు నివ్వెరగులు నేఁడిది యేఁటికే
(॥ఎక్క॥)
రాసి శ్రీవేంకటేశ్వరు రతి నోలలాడేనీకు
సేసకొప్పుతోడ నిఁక సిగ్గు లేఁటికే
బాసయిచ్చి యతఁడు నీవంతము చెల్లించె నీకు
మోసపో కతనిఁ బొంది మొక్కు మొక్క నేఁటికే
(||pallavi||)
ĕkkaḍo savadimām̐ṭa kiṁta siṁta nīgela
sĕkku nŏkki ramaṇum̐ḍu seda dersam̐gānu
(||ĕkka||)
guṭṭudom̐ badi nebŏddum̐ gūḍivuṁḍeyaṭṭinīgu
paṭṭinasalamu lele paḍam̐ti
jaṭṭigŏni yādanido sarasamāḍenīgu
vaṭṭimonamuna nela vāse vidiyeme
(||ĕkka||)
mŏlaganavvuladoḍa momu sūseyaṭṭinīgu
talavaṁchugŏna nele taruṇi
saligubbala nadani sārĕ naddugŏnenīgu
niluvu nivvĕragulu nem̐ḍidi yem̐ṭige
(||ĕkka||)
rāsi śhrīveṁkaḍeśhvaru radi nolalāḍenīgu
sesagŏppudoḍa nim̐ka siggu lem̐ṭige
bāsayichchi yadam̐ḍu nīvaṁtamu sĕlliṁchĕ nīgu
mosabo kadanim̐ bŏṁdi mŏkku mŏkka nem̐ṭige